Andhrabeats

అమెరికాలో OPT రద్దు ముప్పు: భారతీయ విద్యార్థులకు పెను సవాలు!

 

ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను 3 లక్షల 30 వేలకు పైగా మంది మన దేశ విద్యార్థులు అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు.

వీరిలో చాలా మందికి OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) కార్యక్రమం ఎంతో కీలకం. ఇది F-1 వీసా కలిగిన విద్యార్థులకు వారి చదువుకు సంబంధించిన రంగంలో గ్రాడ్యుయేషన్ తర్వాత 12 నెలల వరకు (STEM రంగాల వారికి 36 నెలల వరకు) తాత్కాలికంగా పనిచేసేందుకు అనుమతిస్తుంది.

2023-24లో దాదాపు 97,556 మంది భారతీయ విద్యార్థులు OPT కార్యక్రమంలో లబ్ధి పొందారు. ఇది అమెరికాలోని మొత్తం విద్యార్థుల్లో దాదాపు 29% మంది.

అయితే, అమెరికా కాంగ్రెస్‌లో “ఫెయిర్‌నెస్ ఫర్ హై-స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్” పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు OPT కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనేది ప్రస్తుతం అనిశ్చితంగా ఉన్నప్పటికీ, ఒకవేళ ఇది చట్టంగా మారితే భారతీయ విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

OPT రద్దుకు గల కారణాలు:
కొందరు అమెరికన్ రాజకీయ నాయకులు మరియు వర్గాలు OPTని రద్దు చేయాలని కోరుకుంటున్నారు.

వారి ప్రధాన వాదనలు:
అమెరికన్ ఉద్యోగులకు నష్టం: OPT వలన విదేశీ విద్యార్థులు తక్కువ జీతాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉండటంతో, అమెరికన్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కడం కష్టమవుతోంది.

H-1B వీసాకు అనధికారిక మార్గం: OPT, H-1B వీసా పొందడానికి ఒక బ్యాక్ డోర్ లెక్కన మారిందని కొందరు భావిస్తున్నారు. ఇది H-1B వీసా పరిమితులను ఎస్కేప్ కోసం వాడుతున్నారని వారి అభిప్రాయం.

కాంగ్రెస్ ఆమోదం లేకపోవడం: OPT కార్యక్రమానికి కాంగ్రెస్ యొక్క ప్రత్యేక ఆమోదం లేదని కొందరు చట్టసభ సభ్యులు వాదిస్తున్నారు.

చీప్ లేబర్ వినియోగం: కొన్ని కంపెనీలు OPT విద్యార్థులను తక్కువ వేతనాలకు నియమించుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

భద్రతాపరమైన ఆందోళనలు: OPT ద్వారా వచ్చే విదేశీయుల నేపథ్యంపై తగినంత పరిశీలన లేదని కొందరు భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం:
OPT రద్దు భారతీయ విద్యార్థులకు పెను సవాలుగా మారుతుంది:

గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పనిచేసే అవకాశం చాలా మంది కోల్పోతారు.

H-1B వీసా పొందడానికి OPT ఒక ముఖ్యమైన మార్గం కాబట్టి, అది రద్దయితే భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది.

విద్యా రుణాలు తీసుకున్న వారికి వాటిని తిరిగి చెల్లించడం కష్టమవుతుంది.

పోస్ట్-గ్రాడ్యుయేషన్ పని అవకాశాలు లేకపోతే, చాలా మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదవడానికి ఆసక్తి చూపకపోవచ్చు.

అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గితే అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు కూడా నష్టం వాటిల్లుతుంది.

కాబట్టి, అమెరికాలో చదువుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ పరిణామాలను నిశితంగా గమనించాలి.

OPT రద్దు జరిగితే, ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంచుకునే వారి భవిష్యత్తుపై ఇది గణనీయమైన ప్రభావం చూపుతుంది. తలతిక్కల ట్రంప్ చెలగాటం మన పిల్లల ఆశలపై ప్రభావం చూపుతుంది.

TOP STORIES