అల్లు అర్జున్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్జున్ అరెస్టు తదనంతర పరిణామాల గురించి స్పందిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సమర్థించారు. ఆయన ఏమన్నారంటే..
“అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చారు. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్. వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు. పుష్ప టికెట్లు పెంచారు, బెన్ ఫిట్ షోకు అవకాశం ఇచ్చారు. రేవంత్‍కి రాంచరణ్, అల్లు అర్జున్ చిన్ననాటి నుంచే తెలుసు. అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత కూడా. రేవంత్ రెడ్డిపై ప్రజలు విమర్శలు చేసే అవకాశం ఉంది. కొన్ని సార్లు పరిస్థితులు బట్టి నిర్ణయాలు ఉంటాయి”.
“బెనిఫిట్ షోలు, టికెట్ అధిక ధరలు ఉన్నప్పుడు రికార్డ్ కలెకన్స్ వస్తాయి. సలార్, పుష్ప సినిమాలకు అందుకే రికార్డ్ కలెక్షన్లు వచ్చాయి. అంచనాలు ఎక్కువగా ఉన్న సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు. సినిమా థియేటర్లకు హీరోలు వెళ్లడం వల్ల ఇబ్బందులు వస్తాయి. మొదట్లో మూడు సినిమాలకు వెళ్లి పరిస్థితి అర్థం చేసుకుని ఆగిపోయా. అల్లు అర్జున్‍కు సిబ్బంది చెప్పి ఉండాల్సింది. సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ ప్రభుత్వం సాప్ట్ గా వెళ్లి ఉంటే బాగుండేది. చట్టం కూడా ఎవరిని విడివిడిగా చూడదు. ఘటన జరిగిన మరుసటి రోజు చనిపోయిన వారి ఇంటికి వెళ్లి మీ బాధలో మేము ఉన్నామని చెప్పాలి. అల్లు అర్జున్ వెళ్ళక పోయినా కనీసం చిత్ర యూనిట్ వెళ్లి ఉండాల్సింది. బాధితుడి ఇంటికి వెళ్లి సారీ చెప్పి ఉండాల్సింది. అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపించింది. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది” అని అన్నారు.
“నాగబాబుకు నా సోదరుడిగా కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదు. నాతో సమానంగా నాగబాబు పనిచేశారు. పవన్‌కల్యాణ్ నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజికవర్గం కాకపోయినా, ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడిని. కందుల దుర్గేష్‌ది ఏ కులమో నాకు తెలియదు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత, నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడిని. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లను వారసత్వంగా చూడలేం. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్‌లోకి నాగబాబు వస్తారు.