వివాదాలతో సహవాసం చేసే కేరాఫ్ అస్ట్రాలజర్ వేణు స్వామి మరోసారి సంచలన జ్యోతిష్యం చెప్పారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు జైలుకు వెళ్లిన వాళ్లందరూ ముఖ్యమంత్రులు అయ్యారు. చంద్రబాబు కూడా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లి ఒక రోజు ఉండి వచ్చాడు. త్వరలోనే ఆయన సీఎం అవుతాడు. అయితే ఏ రాష్ట్రానికి మాత్రం చెప్పను. మీరే చూడండి” అంటూ చెప్పాడు.
వేణు స్వామికి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నార్మల్ జనం నుండి మొదలు పెడితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు ఈయన్ని నమ్మే వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చాలా మంది సినీ హీరోయిన్స్ ఆయన దగ్గర పూజలు కూడా చేయించారు.
సమంత, నాగ చైతన్య విడాకుల వార్తల దగ్గర నుంచి దేశంలో ఎవరు ప్రధాని అవుతారు.. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. అమెరికాకు ఎవరు అధ్యక్షుదు అవుతారో కూడా ఆయన చెప్పేవాడు. అందులో అన్ని నిజం కాలేదు కానీ ఏదైనా ఒకటి రెండు నిజమైతే అది తన ఘనతగా చెప్పుకునే వాడు. గత ఎన్నికల్లో వైయస్ జగన్ మళ్ళీ సీఎం అవుతాడని చెప్పి ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత టిడిపి నుంచి విపరీతమైన స్క్రోలింగ్ గురై ఇకపై రాజకీయాల్లో గురించి మాట్లాడనని చెప్పాడు. కానీ తాజాగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లడంతో మళ్లీ తన జ్యోతిష్యం చెప్పాడు.