Andhrabeats

ఆ 6,700 కోట్లు ఏమయ్యాయి? నోట్లు రద్దయినా తిరిగిరాలేదు

2000 notes missing

 

2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుని 19 నెలలు దాటిపోయింది. కానీ రూ.6,700 కోట్ల రూపాయల నోట్లు మాత్రం ఇంకా తిరిగి రాలేదని ఆర్‌బీఐ తెలిపింది. నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించి ఇన్ని నెలలు అయినప్పటికీ ఈ నోట్లు ఎక్కడికి పోయాయో తెలియక ఆర్బీఐ షాకవుతోంది. దీనికి సంబంధించి ఆర్బీఐ కీలక విషయాలు వెల్లడించింది..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి ఏడాదిన్నర దాటింది. అయితే 1.88 శాతం కరెన్సీ నోట్లు ఇంకా వెనక్కి రాలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఆర్‌బీఐ డేటా ప్రకారం, తిరిగి రాని కరెన్సీ నోట్లు రూ.6,691 కోట్లు ఉందని తెలిపింది.

2023లో రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకున్నారు. తదనంతరం, భారతదేశంలోని అన్ని బ్యాంకు శాఖలలో రూ.2000 నోట్లను డిపాజిట్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకులతో పాటు ప్రభుత్వ ఆమోదం పొందిన చోట్ల డిపాజిట్‌ చేశారు. ఈ పథకం చెలామణిలో ఉన్నప్పుడు మొత్తం రూ.2000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు.

రూ.6,700 కోట్లు ఎక్కడ?
ఇది డిసెంబర్‌ 31, 2024 నాటికి రూ.6,691 కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ అధికారిక గణాంకాలు తెలిపాయి. అంటే చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 98.12 శాతం తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ ప్రకటించింది. దానికి సంబంధించి రూ.2 వేల నోట్లలో 1.88 శాతం తిరిగి రాలేదు. ఆర్‌బీఐ అధికారిక గణాంకాల ప్రకారం దీని విలువ రూ.6,691 కోట్లు.

ప్రింటింగ్‌ నిలిపివేత
2018–19లో రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిచిపోయింది. అంటే రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత ప్రజలకు డబ్బులు అందడంలో ఇబ్బంది ఏర్పడింది. ఈ క్రమంలోనే రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టారు. ఈ లక్ష్యం నెరవేరిన తర్వాత రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేసింది.

TOP STORIES