Andhrabeats

ఇకపై రూ.5 కాయిన్స్ కనిపించవు !

ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పాత రూ. 5 కాయిన్స్ స్థానంలో కొత్త కాయిన్ తీసుకువస్తోంది. బంగ్లాదేశ్ లో మందం ఎక్కువగా ఉన్న ఒక్క పాత 5 రూపాయల కాయిన్ కరిగించి 4 నుంచి 5 బ్లేడ్లను తయారు చేస్తున్నారు. ఒక్కో బ్లేడ్ ధర రూ. 2 వేసుకున్నా రూ.5 కాయిన్ తో రూ. 10 సంపాదిస్తున్నారు. దీంతో భారత్ నుంచి బంగ్లాదేశ్ కు రూ. 5 కాయిన్స్ స్మగ్లింగ్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్మగ్లింగ్ ను ఆపడానికి ఆ కాయిన్లను రద్దు చేయాలని భావిస్తున్నారు.

ఏ సంవత్సరంలో ఎన్ని నాణేలు తయారు చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశిస్తుంది. ఆపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాణేలను తయారు చేస్తుంది. ఇప్పుడున్న 5 రూపాయల నాణేలను ఇత్తడి, మరొకటి మందపాటి లోహంతో తయారు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో 5 రూపాయల ఇత్తడి నాణేలు మాత్రమే ఎక్కువగా చెలామణిలో ఉన్నాయి.

కొంతమంది ఈ నాణేలను సేకరించి బంగ్లాదేశ్ కు స్మగ్లింగ్ చేస్తున్నారని తేలింది. వాటితో బ్లేడ్లను తయారు చేస్తున్నట్లు తేలడంతో వాటిని రద్దు చేయాలని నిర్ణయించారు.

 

TOP STORIES