Andhrabeats

ఇదీ సంక్రాంతి విశిష్టత

Definition of Sankranthi Festival

 

సంక్రాంతి పండుగ జరుపుకోవడమే గాకీ దాని గురించి చాలామందికి పెద్దగా తెలియదు. మూడురోజులు జరిగే ఈ పండుగ తెలుగువారికి అతి పెద్ద పండుగ. వారి సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక. పల్లెసీమల భోగభాగ్యాలు, పాడి, పంటలు, పిండి వంటలు, ఆట పాటలు.. ఒకటి కాదు. తెలుగు జాతిని ఒకటిగా కలిపి ఉంచే అతి పెద్ద మహాసంరంభం. భోగి, గొబ్బెమ్మలు, భోగిపళ్లు, మకర సంక్రాంతి, గంగిరెద్దులు, కనుమ వీటిన్నింటి గురించి వివరంగా..

భోగి :
భోగి అంటే భోగం అనుభవించే రోజు అని అర్ధం, పౌష్య లక్ష్మి (పుష్య మాసం) ధాన్యం రైతు ఇంటికి వస్తుంది అది చూసి రైతు సంతోషం గా ఉంటాడు, గడ్డి గాధం వస్తుంది కాబట్టి పశు ప్రాణులు సంతోషంగా ఉంటాయి కాబాట్టి భోగం అనుభవించే రోజు కాబట్టి భోగి అంటారు. ఇంకో పేరు ఆనంద భొవిందము అని అంటారు, భోగికి తిథి ఉండదు ఎందుకంటే దక్షిణాయం ఏ తిధి నాడు పూర్తి అవుతుందో అది భోగి. ద„ì ణాయంలో ప్రకృతి సహకరించదు వానలు వరదలు మంచు లాంటివి ఉంటాయి అందుకే ఆ సమయంలో ఉపాసన చేయాలని చెబుతారు.

గొబ్బెమ్మలు :
సంక్రాంతికి నెలరోజుల ముందు నుండి కన్నె పిల్లల చేత గొబ్బెమ్మలు పెట్టించడం ఆనవాయితీ. కన్నె పిల్లలే ఎందుకంటె.. మగ పిల్లలు ఒక్క వంశానికి మాత్రమే వృద్ధిలోకి తీసుకురాగలరు. అదే ఆడ పిల్లలు 2 వంశాల వృద్ధికి తోడ్పడతారు. గొబ్బెమ్మ లక్ష్మి స్వరూపం (లక్ష్మి స్థానం). లక్ష్మీదేవి గోవుల దగ్గరకు వెళ్లి అడిగింది మిమ్మల్ని అందరు పూజిస్తారు మీలో నాకు స్థానం ఇవ్వండి అని. అప్పుడు గోవులు అన్నాయ్‌ నువ్వు చంచల లక్ష్మివి వెళ్ళిపోతూ ఉంటావ్‌ మా దగ్గర వద్దు అన్నాయి. అప్పుడు లక్ష్మీదేవి నేను అలా వెళ్లిపోతూ ఉండాలి అదే ధర్మం. అధర్మం ఉన్న చోట నేను ఉండకూడదు. అప్పుడే ధర్మం నిలబడుతుంది. వెళ్లి పోవద్దు అంటే ఎలా అని అడిగింది. అప్పుడు గోవులు నువ్వు అయితే మా మల విసర్జన సాథనం వద్ద ఉండు అని చెప్పాయి. ఇలా నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మలను ఎండిన తరువాత భోగి రోజున అగ్నిలో కలుపుతారు. ఎందుకు అగ్నిలో కలుపుతారంటే.. మంచి ఆలోచనలు ధార్మికమైయినా అభివృద్ధిని అగ్ని దేవుడు ఇస్తాడని.

భోగి పళ్ళు :
పిల్లలలకు భోగి పళ్ళు పోస్తారు. ఎందుకోసమంటే.. గత జన్మల చెడు ఖర్మలు, పాపాలు పోవటానికి. చెరుకు ముక్క, భోగి పళ్ళు, చిల్లర కలిపి తల నుండి కిందకి పోస్తారు దీని వలన పీడ పోయి భోగములు అనుభవించ వలసిన శక్తి పొందుతారు.

మకర సంక్రాంతి :
సూర్యుడు మకర సంక్రాంతిలోకి ప్రవేశించిన కాలం రెండుగా ఉంటుంది. దక్షిణాయం, ఉత్తరాయం. దక్షిణాయంలో దేవతలు నిద్ర పోతారు. ఉత్తరాయణంలో నిద్ర లేస్తారు. ఈ రోజు తెల్లవారు జామున (3 గంటల ముందు బ్రమ్మ ముహూర్తం) నదీ స్నానం చేస్తే చాల పుణ్యం.

గంగిరెద్దులు :
ఈ కాలంలో దానం చేయటం చాలా శ్రేష్టం సాక్షాత్‌ మహా విష్ణువు ఈ రూపంలో మన ఇళ్ల దగ్గరకు అతిధుల రూపంలో వస్తారు అని ఉవాచ. దానం చేసి త్యాగం చేయటం నేర్చుకో ఇది మన అభ్యున్నతికి తోడ్పాటును కలుగచేస్తాయని చెబుతుంది.

కనుమ :
అందరు బాగుండాలి, అన్ని జీవరాసులు బాగుండాలి అని పక్షి పూజ పశు పూజ చేసి మనం తినే అన్నం పాయసం దానికి పెట్టి మనతో పాటు వాటికి కూడా భోగం అనుభవించేలా చేయాలి, అందుకే పంట రాగానే కొన్ని కంకులను గుత్తు లా కట్టి ఇంటి బయటా, దేవాలయాల్లో వేలాడ తీస్తారు. అవి పక్షుల కోసం. ఇంట్లో ఉన్న పశువులను పూజిస్తారు, పూలు కడతారు. అందరు అన్ని జీవ రాసులు బాగుండాలి అని అని కనుమ చేస్తారు.

 

TOP STORIES