Andhrabeats

ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడి మధ్య గొడవ ఎందుకు? 

అధ్యక్షుడు జెలెన్ స్కి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.

ఇదెందుకు జరిగింది. దీని వెనుకున్న కారణాలు తెలుసు కుందాము.

ఉక్రెయిన్‌లో 500 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 43 లక్షల కోట్లు) విలువైన ఖనిజ సంపద వుంది.

దీనిపై పెత్తనం కోసం అమెరికా కన్నేసింది. దానిలో భాగంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ కు బాంబులు సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఖనిజాలపై పెత్తనం ఇవ్వాలని కోరింది. దీనిపై ఒప్పందం చేసుకునేందుకు జెలెన్సకి వైట్ హౌస్ కి వెళ్ళాడు. ఆ సమయంలో ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే వుక్రెయిన్‌లో అరుదైన ఖనిజాల నిల్వలు ఉన్న కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్నాయి.
ఉక్రెయిన్ ఖనిజాల్లో
ఎలక్ట్రిక్ కార్లు, ఆధునిక ఆయుధాలు, సైనిక పరికరాల తయారీలో ఉపయోంచే విలువైన ఖనిజ సంపద వుంది. ఇది అమెరికా చేతికి అందితే ఇప్పటి వరకూ ఖనిజ సంపదలో అధిపథ్యం వున్న చైనా ను దెబ్బ తీయొచ్చు.
ప్రపంచంలో మొత్తం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా వాటా 60 నుంచి 70 శాతం వరకు ఉంది. ప్రాసెసింగ్ సామర్థ్యంలో కూడా చైనాకు 90 శాతం వాటా ఉంది.
ఇక ప్రపంచంలో కీలకంగా భావించే 30 ఖనిజాల్లో 21 ఉక్రెయిన్‌లో ఉన్నాయి. ఇవి మొత్తం ప్రపంచంలో అరుదైన భూ ఖనిజాల నిల్వలలో 5
ఐదు శాతం. ఖనిజాల నిల్వలు చాలావరకు క్రిస్టలైన్ షీల్డ్ దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్నాయి. ఉక్రెయిన్‌లో కోటీ 90 లక్షల టన్నుల గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. దీనిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉపయోగిస్తారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన లిథియం నిల్వలు కూడా అక్కడ ఉన్నాయి. యూరప్‌లో అతిపెద్ద లిథియం నిల్వల్లో మూడో వంతు ఉక్రెయిన్‌లోనే ఉన్నాయి.
రష్యా దాడికి ముందు ప్రపంచంలో టైటానియంలో ఏడు శాతం ఉక్రెయిన్ ఉత్పత్తి చేసేది. విమానాల నుంచి విద్యుత్ కేంద్రాల వరకు అంతటా టైటానియం ఉపయోగిస్తారు.వాటిల్లో అరుదైన భూ ఖనిజ నిల్వలను రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా దాదాపు 350 బిలియన్ డాలర్ల విలువైన ఖనిజ వనరులను తన అధీనంలోకి తీసుకుంది. అటు చైనా ఇటు రష్యా చేతుల్లోకి ఖనిజాలు పోతే అమెరికా ఇబ్బందుల్లో పడుతుంది. అందుకని ఉక్రైన్ ఖనిజాలకోసం ఇప్పుడు అమెరికా గొడవ పెడుతోంది.
ఈ అరుదైన ఖనిజాలేంటి?
స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, వైద్య పరికరాలు వంటి అనేక వస్తువుల తయారీలో ఇక్కడ దొరికే ఖనిజాలు ఉపయోగిస్తారు. స్కాండియమ్, వాయీట్రియమ్, లేంథనమ్, సీరియమ్, ప్రెసిడోనియమ్, నియోడైమియం, ప్రోమేథియం, సమారియం, యూరోపియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, హోల్మియం, ఎర్బియం, థోలియం, లుటెటియం వంటివి అక్కడ ఎక్కువ విస్తీర్ణంలో వున్నాయి. థోరియం, యురేనియం వంటి రేడియోధార్మిక మూలకాలతో పాటు అరుదైన భూ ఖనిజాలు కూడా అక్కడ వున్నాయి. వాటికోసం అన్నమాట గొడవ.

TOP STORIES