Andhrabeats

ఉపేంద్ర ‘యూఐ’ మూవీ ఎలా ఉందంటే !

 

కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్రకు ప్రత్యేకంగా ఓ ఫ్యాన్‌ బేస్‌ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. ఏ దర్శకుడికి రాని భిన్నమైన ఐడియాలతో సినిమాలను తెరకెక్కించడంతో ఎప్పుడూ ముందుండే ఉపేంద్ర ఇప్పటి వరకు పలు విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు.

ఉపేంద్ర సుమారు పదేళ్ల తర్వాత నటిస్తూ, దర్శకత్వం వహించిన మూవీ యూఐ. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉపేంద్ర, రేష్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా తమిళం, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు

విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే ఉపేంద్ర ఈ ’యూఐ’ చిత్రాన్ని కూడా అదే కాన్సెప్ట్‌తో తీసుకొచ్చారు. ’పగలు, రాత్రి’ సత్య (ఉపేంద్ర) వర్సెస్‌ కల్కి భగవాన్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీ ఉంటుంది. ఇక ఇందులో 2040లో ప్రపంచం ఎలా ఉంటుందన్న విషయాలను ఉపేంద్ర సెటైరికల్‌ విధానంలో చూపించారు. హీరోగా, దర్శకుడుగా ఉపేంద్రకు మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి. తనదైన టేకింగ్‌తో మళ్లీ పాత ఉపేంద్రను గుర్తు చేశారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో వచ్చే సైకో లవ్‌ ట్రాక్‌ వింటేజ్‌ ఉపేంద్రను గుర్తు చేస్తుంది. ఇక సినిమా కాన్సెప్ట్‌ వైవిధ్యంగా తెరకెక్కించారు. ప్రతీది ఓ కారణంతోనే జరుగుతుందని ఈ సినిమా ద్వారా ఉపేంద్ర చెప్పాడు. ఇక ఇది సినిమా కాదని, మనిషి ఆలోచనలకు ప్రతిరూపం అని కొందరు నెటిజన్లు ట్విట్టర్‌ వేదికగా అభిప్రాయపడుతున్నారు. సమాజంపై ఉపేంద్ర తీసిన సెటైరికల్‌ మూవీ అని అంటున్నారు.

సినిమాలోని ఓ ఎపిసోడ్‌ను ఇప్పటి వరకు ఏ దర్శకుడు కూడా తెరకెక్కించని రీతిలో ఉపేంద్ర తీశారు. సినిమా అంత ఒకెత్తయితే క్లైమాక్స్‌ మరో ఎత్తు అని చెప్పాలి. సినిమాకు రెండు క్లైమాక్స్‌లు పెట్టాలనే అద్భుత ఆలోచనతో ఆకట్టుకున్నాడు. మొత్తం మీద సినిమాకు అన్నీ తానై నడిపించారు ఉపేంద్ర. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను తనదైన శైలిలో చూపించారు.

మీరు ఇంటిలిజెంట్‌ అనుకుంటే.. వెంటనే థియేటర్‌ నుండి బయటకి వెళ్ళండి’ అంటూ మొదట్లోనే ప్రేక్షకులకు సవాల్‌ విసరడం ఉపేంద్రకు మాత్రమే దక్కింది. ‘యూఐ’ పక్కాగా వీక్షించే మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఉపేంద్ర సరికొత్త రికార్డ్‌.. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత దర్శకత్వం వహించిన ఉపేంద్ర యూఐ మూవీతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ట్రైలర్, కాన్సెప్ట్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగిన నేపథ్యంలో ఈ సినిమా బుకింగ్స్‌ రికార్డు స్థాయిలో జరిగాయి. కన్నడ సినీ చరిత్రలో ఏ ఇతర సినిమాకు రానంత బుకింగ్స్‌ను యూఐ మూవీ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆన్‌లైన్‌లో ఏకంగా 75 వేల టికెట్స్‌ అమ్ముడుపోయి రికార్డ్‌ సెట్‌ చేసింది.

TOP STORIES