Andhrabeats

ఎన్టీఆర్, ఏఎన్నార్ సక్సెస్ అయినా కాంతారావు ఎందుకు అవలేదు?

గెలవాలంటే కష్టపడాలి, రాళ్ళు కొట్టాలి, బస్తాలు మోయాలి అని ఎవరైనా చెప్తే వాళ్ళని పక్కన పడేయండి కారణం అలాంటి మాటలు చెప్పి సదరు వ్యక్తులు బతుకు ఈడుస్తున్నారు తప్పితే అందులో ఇసుమంత కూడా నిజం లేదు.

మన దేశం లో ఏ రంగం లో గెలవాలన్నా కావాల్సింది రెండే రెండు
1. నెట్ వర్క్
2. సపోర్ట్ సిస్టం

NTR సినెమాలు నిర్మించలేదా..? ANR సినెమాలు నిర్మించలేదా..? వాళ్ళు నిర్మించిన సినెమాలు ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ అవ్వలేదా..? మరి వందల ఎకరాలు ఉండి 400 వందలకి పైగా సినెమాల్లో నటించిన కాంతారావు గారు నిర్మించిన సినెమాలు కొన్ని ఫ్లాప్ అవ్వగానే సర్వం కోల్పోయాడా..? కాంతారావు గారు తెలివి తక్కువ వాడా..?

వాస్తవం ఏమిటంటే ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ సంస్థల చేతుల్లో పెత్తనం అంతా ఉండేది. NTR కి అండా దండలుగా జ్యోతి ఫిలింస్, లక్ష్మీ ఫిలింస్ ఉండేవి. ANR కి నవయుగ, అన్నపూర్ణ ఉండేవి. కాంతారావు గారు మంచి సినెమాలు తీసినా, అవి గొప్ప సినెమాలు అయినా డిస్ట్రిబ్యూషన్ సంస్థల నుంచి సహకారం లేదు. NTR, ANR కి నెట్ వర్క్ మరియూ సపోర్ట్ సిస్టం బలం గా ఉంది, కాంతారావు గారికి లేవు.

సరే కనీసం సినెమాలు తీసి బాగా నష్టపోయిన జాబితా లో అయినా కాంతారావు గారి పేరు ఉంటుందా..? అక్కడ కూడా, అండా దండలు మరియూ నెట్ వర్క్ & సపోర్ట్ సిస్టం ఉన్న సావిత్రి గారి పేరే ఉంటుంది కానీ కాంతారావు గారి పేరు ఉండదు. మహా అయితే ఒక 40 ఎకరాలు ఉంటుందేమో సావిత్రి గారి ఆస్థి. కానీ 400 ఎకరాలు ఉండి ఆ తర్వాత అంతా కోల్పోయిన జాబితాలో కూడా ఆయన పేరు పెద్దగా వాడుకలో ఉండదు.

గెలిచేవాడికి, ఓడిపోయేవాడికి తేడా ఒకే ఒక్కటి – నెట్ వర్క్ మరియూ సపోర్ట్ సిస్టం. మన దేశం లో ఎవడ్ని అబ్సర్వ్ చేసినా కనిపించేది అదే. క్రింద పడినవాడు చేయాల్సింది మళ్ళీ పైకి లేసి కష్టపడటం కాదు, లేసిన తర్వాత నెట్ వర్క్ పెంచుకోవటం.

చిన్న ఉదాహరణ: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, బొంబాయి లేదా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉండే ఒక సాధారణ వ్యభిచారి ని గమనించండి – వాళ్ళు అక్కడ నిలబడి ఉంటారు కానీ కొంచెం దూరం లో ఒక ఆటో ఉంటుంది వాళ్ళ కి ఏదైనా అయితే వెంటనే ఆటో లో వెళ్ళటానికి. అది మిస్ అయితే, ఇంకొంచెం దూరం లో ఒక కార్ ఉంటుంది. అదీ మిస్ అయితే, ఇంకో ఇద్దరు ఆమె కి సహాయం చేయటానికి రడీ గా ఉంటారు గమనిస్తూ . ఇవి అన్నీ మిస్ అయినా, కొందరు పోలీసులు సహాయం చేస్తారు. చివరికి పోలీసులే పట్టుకున్నా వాళ్ళని విడిపించటానికి కొందరు రాజకీయ నాయకులు సహాయం చేస్తారు. అదీ మిస్ అయితే, మీడియా లో కొందరు సహాయం చేస్తారు. ఈ విధం గా ఉంటుంది వాళ్ళ నెట్ వర్క్.

అడ్డ దారిలో ఒక 1000 లేదా 2000 రూపాయలు సంపాదించటానికే ఇంత నెట్ వర్క్ ఉంటే కోట్లు సంపాదించాలి అంటే మనం ఎంత పెద్ద నెట్ వర్క్ నిర్మించుకోవాలి..? ఏ రంగం లో గెలవాలన్నా ఎంత నెట్ వర్క్ ఉండాలి , ఎంత సపోర్ట్ సిస్టం కావాలి..?

అవును అన్నా, కాదు అన్నా మన దేశం లో డైరక్ట్ గానో, ఇన్ డైరక్ట్ గానో మనం పుట్టిన కులానికి, మన నెట్ వర్క్, సపోర్ట్ సిస్టం & భవిష్యత్తు కి సంబంధం ఉంటుంది. అందుకే చాలా రంగాలలో కొన్ని కులాల వాళ్ళకి, ప్రాంతాల వాళ్ళకి బాగా ఎదగటానికి అవకాశాలు ఎక్కువ ఉంటై.

టాలెంట్ అవసరం లేదు అని నేను చెప్పటం లేదు. అది లేకపోయినా చాలా ఎక్కువ మంది గెలుస్తున్నారు, గెలవటానికి ఎక్కువ అవకాశం ఉంది. అలా అని, అందరూ నెట్ వర్క్ & సపోర్ట్ సిస్టం లేకనే ఓడిపోతున్నారు అని చెప్పటం కూడా నా ఉద్దేశ్యం కాదు. రకరకాల వ్యసనాల వలన, తెలివి తక్కువ తనం వలన, వివిధరకాల ఇతర కారణాల వలన ఓడిపోయేవాళ్ళూ ఉన్నారు. కానీ, టాలెంట్ ఉన్నా చాలా ఎక్కువ మంది ఓడిపోవటానికి ప్రధాన కారణం నెట్ వర్క్ మరియూ సపోర్ట్ సిస్టం పెద్దగా లేకపోవటం.

ఎంత మంచి చదువులు చదివినా, మంచి మార్కులు వచ్చినా మంచి ఉద్యోగం లేనివాళ్ళు లక్షల మంది ఉంటారు, కానీ రిఫరెన్స్ ఉండి నెట్ వర్క్ లేదా సపోర్ట్ సిస్టం ఉన్న వాళ్ళకి 20 నుంచి 40 సబ్జెక్ట్ లు ఫెయిల్ అయినా ఆ తర్వాత చాలా మంచి ఉద్యోగం వస్తుంది.

అమెరికా, కెనడా లల్లో ఉద్యోగం చేసే మన వాళ్ళని గమనిస్తే అందరికీ టాలెంట్ ఉండి లక్షలు లక్షలు సంపాదించటం లేదు. వందకి 87% మంది నెట్ వర్క్ మరియూ ఏదో ఒక సపోర్ట్ సిస్టం వలనే అయి ఉంటుంది. మన దగ్గర ఉన్నవాళ్లతో పోలిస్తే ఎందుకూ పనికి రాని వాళ్ళు అక్కడ వేలల్లో కాదు, లక్షల్లో ఉంటారు. బయట దేశాల్లో అయినా, మన దేశం లో అయినా నెట్ వర్క్ మరియూ సపోర్ట్ సిస్టం అనేది అత్యంత ప్రధాన కారణం ఎదగటానికి, గెలవటానికి.

ఈ మధ్య ఏదో ఒక సినెమా లో తమిళ నటుడు ధనుష్ బిచ్చగాడి క్యారక్టర్ బాగా చేశాడు. తెలుగు లో అలాంటి క్యారక్టర్ చేసే నటుడు ఉన్నాడా అని కొందరు మిత్రులు అంటున్నారు. నిజమే, మనం అతిగా పాపులర్ చేసిన లేదా నెట్ వర్క్ మరియూ సపోర్ట్ సిస్టం వలన పాపులర్ అయిన మహేష్ బాబు, జూనియర్ NTR, రాం చరణ్, పవన్ కల్యాణ్, బాల క్రిష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి నటులు చేయకపోవచ్చు. కానీ నవీన్ పొలిశెట్టి కి మంచి కథలు రాయ గలుగుతారా..? కార్తికేయ, విజయ్ దేవరకొండ లని ఇండస్త్రీ లో నంబర్ వన్ పొజీషన్ లో మనం చూడగలుగుతామా..? ఎంత మందికి టాలెంట్ లేదు. కానీ వాళ్ళ వాళ్ళని పైకి లేపటం కోసం పక్కన ఉన్న రాష్ట్రాల వాళ్ళకి మంచి కథలు ఇస్తారు కానీ మన వాళ్ళకి ఇవ్వరు. మన సత్య దేవ్ లాంటి వాడు, విజయ్ సేతుపతి చేసే క్యారక్టర్స్ చేయలేడా..?

మనలో ఎక్కువమంది మీద ఉన్న అసహనం తో వేరే భాష నటులని పైకి లేపుతున్నం కానీ రజనీ కాంత్ నిజం గా గొప్ప నటుడా..? అతని సినెమాలు రెండు మూడు మించితే అసలు బాగుంటాయా..? అతను నిజం గా యాక్టింగ్ లో సూపర్ ఆ..? ఏవో కొన్ని గొప్ప డైలాగ్స్ రచయిత లు డైరక్టర్స్ రాసి అతనితో చెప్పించినంత మాత్రాన మన దగ్గర ఉన్న నటుల కంటే అతను గొప్పవాడా..? అదంతా వేరే విషయం, టాపిక్ డీవియేట్ అవుతుంది.

ఒక్క సినెమా రంగం అనే కాదు, సాఫ్ట్ వేర్ రంగం తో పాటు అంత రిక్ష రంగం, రాజకీయ రంగం కూడా అంతే.

చిరంజీవి కష్ట పడ్డాడు కావొచ్చు కానీ అల్లు రామ లింగయ్య, అల్లు అరవింద్ రూపం లో బలమైన సపోర్టింగ్ ఉంది, నెట్ వర్క్ ఉంది. మై హోం రామేశ్వరావు అయినా, గ్రంధి మల్లిఖార్జున రావు అయినా, ఈనాడు రామోజీ రావు కి అయినా వాళ్ళ కష్టం తో పాటు కులబలం, నెట్ వర్క్, సపోర్టింగ్ సిస్టం ఉంది.

ఏ సపోర్ట్ లేకుండా కనీసం రోడ్డు పక్కన ఇడ్లీ బండి పెట్టుకోగలమా..?

ప్రస్తుత పెట్టుబడీదారీ వ్యవస్థ లో గెలవాలి అంటే ఖచ్చితం గా బలగం/సపోర్టింగ్ సిస్టం, నెట్ వర్క్ ఉండాలి. ఏ సపోర్ట్, ఎవరి సపోర్ట్ లేకపోతే మనకి మనమే సపోర్ట్ చేసుకొని, నెట్ వర్క్ నిర్మించుకొని నిలిచి గెలవాలి కానీ మన చుట్టు పక్కన ఉన్న జనాల మాటలు పట్టించుకోకూడదు, ఏది చెయ్యాలో అదే చెయ్యాలి – గెలవటానికి!

గత 100 సంవత్సరాల నుంచి చూస్తే మన సమాజం లో ఏదో ఒక సపోర్ట్ లేదా నెట్ వర్క్ ఉన్నోడే గెలుస్తున్నాడు సపోర్ట్/ నెట్ వర్క్ లేనోడు గెలిచిన ధాఖలాలు లేవు. కనీసం ఎవరికి వారు సపోర్ట్ చేసుకొని నిలబడగలగాలి కిందపడ్డప్పుడు, అంతేకాని ఇజ్జత్ లేని సమాజం లో బతుకుతూ మన ఇజ్జత్ గురించి అసలు పట్టించుకోకూడదు.

చిన్నవాడు అయినా, పెద్ద వాడు అయినా…వ్యాపారం, రాజకీయం, ఉద్యోగం, వివాహం ఏదైనా, ఎందులో అయినా సరే, ఏ రంగం అయినా సరే – టాలెంట్ ఉన్నా లేకపోయినా నెట్ వర్క్ లేదా సపోర్ట్ సిస్టం ఉంటే గెలుస్తారు లేకపోతే ఓడిపోతారు. నెట్ వర్క్, సపోర్ట్ సిస్టం తో పాటు టాలెంట్ మరియూ కష్టపడే తత్వం ఉంటే ఇంకా బెటర్.

నీవు గెలవాలి అనుకుంటే నీ దగ్గర ఉన్న పుస్తకాలు అన్నీ పక్కన పెట్టు, యూ ట్యూబ్ ఛానల్స్, రీల్స్ మరియూ మిగతా ప్రవచనాలు అన్నీ పక్కన పెట్టి నెట్ వర్క్ మరియూ సపోర్ట్ సిస్టం మీద ఫోకస్ పెట్టు. ఒకవేళ ఎవరూ లేరు, ఏ సపోర్ట్ సిస్టం లేదు అనుకుంటే నీకు నీవే సపోర్ట్ గా నిలబడి నెట్ వర్క్ నిర్మించుకో. అదే విజయానికి మొదటి మెట్టు…

_____
జగన్నాథ గౌడ్

TOP STORIES