ఏపీలో డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ నిలిపివేసింది. అయితే పార్టీ నేతలు, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కొత్త కార్డుల జారీకి సిద్ధమైంది.
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు ఇతర సర్వీసులకు సైతం అవకాశం కల్పించనుంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనుంది. మార్పులు, చేర్పులు చేసిన కార్డులు, కొత్త కార్డులన్నింటినీ సంక్రాంతి కానుకగా అందించాలని భావిస్తోంది.