Andhrabeats

కుంభమేళాలో పూసలమ్మే మొనాలిసా స్టార్ అయిపోయింది

సామాజిక మాధ్యమాలు ఎందరినో వెలుగులోకి తెస్తున్నాయి. మట్టిలోనే ఉండిపోయిన ప్రతిభావంతులు, కళాకారులను వెలికితీస్తున్నాయి. తాజాగా కుంభమేళాలో ఒక మట్టిలో మాణిక్యం బయటకు వచ్చింది. కానీ మీడియా ఆమెను వేధిస్తున్న తీరుతో ఆమె కుటుంబం తల్లడిల్లిపోతోంది.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయోగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఎక్కువగా వైరల్ అయిన 16 ఏళ్ళ యువతి “మొనాలిసా”. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కి చెందిన మొనాలిసా మహా కుంభమేళాలో రంగురంగుల పూసలు రుద్రాక్షలు అమ్ముతూ ఒక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ కంటబడింది. ఇక అంతే ఆమె ఒక మట్టిలో మాణిక్యమని సినిమా తారల కన్నా గొప్ప సౌందర్యవతి అని ఆకాశానికి ఎత్తేశాడు. దీంతో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఛానల్స్ ప్రతినిధులు అక్కడకు వాలిపోయి ఆ బాలికను ఇంటర్వ్యూలు చేశారు. భవిష్యత్తు బాలీవుడ్ నటి అంటూ భజన చేయడం మొదలుపెట్టారు. వీరి హడావిడితో చివరకు ఆమె పూసలు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను కాపాడుకోవడానికే తమ సమయం సరిపోతుందని ఆవేదన చెందుతున్నారు.

దేశంలో ప్రతిభకు కొదవ లేదు. ఏ మూలకు వెళ్లినా ఎంతో ప్రతిభ గల వ్యక్తులు తారసపడతారని, సాదాసీదా జీవితం గడుపుతూనే తమ అద్భుతమైన టాలెంట్‌తో అబ్బురపరుస్థారని ఒకావిడ  ‘ బర్పెటా టౌన్‌ ద ప్లేస్‌ ఆఫ్‌ పీస్‌ ’ అనే ఫేస్‌బుక్‌ పేజీ ఆమె గానాన్ని నెటిజన్లకు పరిచయం చేసింది మీకు గుర్తుందా ? పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్‌ రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేస్తున్న రేనూ మొండల్ ‘ఏక్‌ ప్యార్‌కి నగ్మా’ అనే పాటను ఆలపిస్తున్న వీడియోను ఆ పేజీ పోస్టు చేసింది. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో ఆమె గానాన్ని, ఆమె గొంతులోని మాధుర్యాన్ని చూసి నెటిజన్లు తన్మయులయ్యారు. గంధర్వ గానమంటే ఇదే అయి ఉంటుందని, అచ్చం లతా మంగేష్కర్‌ సుతిమెత్తగా పాట పాడుతుందా? అన్నంత మాధుర్యం ఆమె గొంతులో ఉందని నెటిజన్లు విపరీతంగా ప్రశంసించారు. ఆమె గానంలో ఓలలాడుతూ ఆనందపారవశ్యులవుతున్నట్టు పేర్కొన్నారు. 2019 జూలై 28న పోస్ట్‌ చేసిన ఆమె సింగింగ్‌ వీడియోను ఇప్పటికే 16 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. 35 వేల మంది ఆమె వీడియోను షేర్‌ చేసుకున్నారు. ఆమె పాట సూపర్‌ హిట్‌ కావడంతో మరో వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో లతా మంగేష్కర్‌ క్లాసికల్‌ పాటను ఆమె మధురంగా ఆలపించారు. బిక్షాటన చేస్తూ జవానుల కోసం పాడిన పాట ప్రజలను బాగా ఆకర్షిచింది. దీంతో బాలీవుడ్ కు బ్రహ్మాండమైన  గాయని దొరికిందని ఊడరగొట్టారు. వీరి రాతలు పోస్టులు చూసి ఒక సినిమా నిర్మాత ఏకంగా 4 పాటలకు అవకాశం ఇచ్చాడు. కీచు గొంతు అని అదే ప్రేక్షకులు  ఈసడించుకున్నారు . ఆ తర్వాత సినిమా తీసిన ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు. ఇప్పుడు ఆ గాయని మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంది.

తాజాగా సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలోనూ ఎక్కువగా వైరల్ అయిన మొనాలిసా పలువురితో మాట్లాడుతూ తాను తన కుటుంబం సామాన్యమైన మధ్యతరగతి వారమని తమకు ఎటువంటి సినిమా పిచ్చి లేదని తేల్చి చెప్పింది. మీడియా సోషల్ మీడియా ఎంతసేపు సంచలనాల కోసం తాపత్రయ పడుతున్నారు గాని ప్రజా సమస్యల మీద ఏమాత్రం దృష్టి కేంద్రీకరించడం లేదు.

TOP STORIES