జమిలి ఎన్నికలకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలు జమిలిగానే జరపాలని ప్రధాని మోడీ కృతనిశ్చయంతో ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పన కూడా పూర్తయిందంటున్నారు. కేంద్ర న్యాయ శాఖ బిల్లును సిద్ధం చేసినట్లు సమాచారం. బుధవారం నిర్వహించే కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు ఈ బిల్లు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. లేదంటే వచ్చే బుధవారం కేబినెట్ సమావేశానికి ముందు సంబంధిత ముసాయిదా బిల్లు వస్తుందంటున్న అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర కేబినెట్ ఆమోదం తరువాత పార్లమెంటు ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఒకే దేశం ఒకే ఎన్నికకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు కేంద్రం గతంలోనే ఆమోద ముద్ర వేసింది.