ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛను అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గురువరం కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఈ విషయాన్ని ప్రకటించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారుల వివరాలను సేకరించాలని, వారికి వెంటనే పింఛన్‌లు అందించే దిశగా చర్యలు చేపట్టాలని సమావేశంలో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.
ప్రతి ఏటా ఈ జాబితాను సిద్దం చేసి అప్‌డేట్ చేయాలన్నారు. త్వరలోనే చిన్నారుల పింఛన్లకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అనర్హులకు పింఛను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారుల వివరాలను సేకరించాలని, వారికి వెంటనే పింఛన్‌లు అందించే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పారు.