Andhrabeats

తీరం దాటినా వణికిస్తున్న ఫెంగల్ తుఫాను

పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన ఫెంగల్ తుఫాన్ ఇంకా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఆదివారం సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద కొనసాగుతోంది. మాములుగా అయితే తీరం దాటిన 2, 3 గంటల్లో ఏ తుఫాను అయినా బలహీనపడుతుంది. కానీ ఫెంగల్ తుఫాను తీరం దాటి 5, 6 గంటలైనా బలహీనపడకుండా స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ  రానున్న కొద్ది గంటలలో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు.

దీని ప్రభావంతో ఇవాళ ,రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అత్యధికంగా సూళ్లూరు పేటలో 17 సెంటిమిటర్లు వర్షపాతం నమోదైంది.

రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలు అయిన కాకినాడ, కోనసీమ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయి.
అత్యంత భారీ వర్షాల కారణంగా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

TOP STORIES