దేశంలో HMPV కేసులు పెరుగుతున్నాయి. సోమవారానికి ఈ కేసులు 6కి చేరాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్,పశ్చిమ బెంగాల్ లో HMPV కేసులు నమోదయ్యాయి. కర్ణాటక బెంగుళూరులో రెండు, తమిళనాడు చెన్నైలో రెండు, గుజరాత్ అహ్మదాబాద్ లో ఒకటి, పశ్చిమ బెంగాల్ కోల్ కతా ఒక కేసు నమోదైంది.
కేసుల పెరుగుతుండడంతో భారత ప్రభుత్వం
WHO తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ కేసులు శరవేగంగా పెరిగిపోతుండడంతో చైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించింది.
HMPV లక్షణాలు
దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, గురక, శ్వాస ఆడకపోవడం, దద్దుర్లు.
వేగంగా కేసులు విస్తరిస్తోన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీని బారిన పడకుండా ఉండటానికి పలు సూచనలు ఇచ్చింది.
చేయాల్సినవి..
దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్‌ను అడ్డు పెట్టుకోవాలి.
సబ్బు లేదా అల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో తరచూ చేతులను శుభ్రపర్చుకోవాలి.
గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లూతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి.
జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు. గుంపులో తిరగకూడదు.
చాలినంత మంచినీళ్లు తీసుకోవాలి. పౌష్టికాహారాన్ని స్వీకరించాలి.
అనారోగ్యం బారిన పడినప్పుడు ఇతరులను కలుసుకోవడాన్ని తగ్గించాలి. ఇంట్లోనే ఉండాలి.
గాలి ధారాళంగా వచ్చేలా చేసుకోవాలి.
కంటి నిండా నిద్రపోవాలి.
చేయకూడనివి
ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు.
ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లు, హ్యాండ్ కర్చీఫ్‌ను మళ్లీ వాడకూడదు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారితో దూరంగా ఉండాలి.
తరచూ కంటిని నలుపుకోవడం, ముక్కు, నోటిని చేత్తో తుడుచుకోవడాన్ని మానుకోవాలి.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు.
డాక్టర్‌ను సంప్రదించకుండా సొంతంగా ఎలాంటి మెడిసిన్‌నూ వాడకూడదు.