పండుగ రోజుల్లో సాధారణ, మధ్య తరగతి ప్రయాణికులకు అవసరమైన రైళ్లను అందుబాటులో ఉంచాల్సిన అందుకు విరుద్ధంగా ఉన్న పాసింజర్ రైళ్లను కూడా రద్దు చేసింది. వివిధ కారణాలతో రాజమహేంద్రవరం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించే పాసింజర్ రైళ్లను ఈ నెల 26 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు రద్దు చేయడంతో ప్రయాణికులు అందోళన చెందుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన వారు దూర ప్రాంతాల నుంచి విశాఖ చేరుకుని, ఇక్కడ నుంచి పాసింజర్ రైళ్లలోనే స్వస్థలాలకు చేరుకుంటారు. రైళ్లు అందుబాటులో లేకపోతే… పండగ వేళ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని, అప్పుడు అధిక ఛార్జీల భారం తప్పదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి.. ప్రత్యామ్నాయంగా అదనపు రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
రద్దయిన రైళ్లు ఇవే..
ఈనెల 26 నుంచి 28 వరకు
రాజమహేంద్రవరం– విశాఖ (07466)
విశాఖ– విజయనగరం(07468)
ఈ నెల 27 నుంచి మార్చి 1 వరకు
విశాఖ– రాజమహేంద్రవరం (07467)
విజయనగరం– విశాఖ (07469)
విశాఖ– పలాస– విశాఖ (07470–07471).