పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో డెడ్‌బాడీ కలకలం రేపింది. ఆ డెడ్‌బాడి పార్శిల్‌లో రావడంతో అంతా భయపడిపోయారు. ఉండి మండలం యండగండిలో తులసి అనే మహిళకు ఓ పార్శిల్ వచ్చింది. అందులో ఎలక్ట్రిక్ పరికరాలు ఉన్నాయంటూ పార్శిల్ తెచ్చిన వ్యక్తి చెప్పి.. ఇచ్చి వెళ్లిపోయాడు. కాసేపు ఆగిన తర్వాత పార్శిల్ ఓపెన్ చేసిన తులసి కాళ్లు చేతులు వణికిపోయాయి. పార్శిల్‌లో కుళ్లిన డెడ్‌బాడీని చూసిన తులసికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందర్నీ పిలిచి చూపించింది. వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. తనకు ఓ పార్శిల్ వచ్చిందని అందులో కుళ్లిన డెడ్‌బాడీ ఉందని వివరించింది.
తులసి కుటుంబం ఇంటిని నిర్మించుకోవడానికి క్షత్రియ పరిషత్‌ను ఆర్థిక సాయం అడిగింది. వాళ్లు గతంలో రెండుసార్లు నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని పంపించారు. నిర్మాణం పూర్తయి ప్రస్తుతం విద్యుత్ పనులు జరుగుతుండడంతో మరోసారి సాయం అడిగారు. ఈసారి పరిషత్ విద్యుత్ సామాన్లను కొనుగోలు చేసి తులిసి ఇంటికి పంపించింది. ఒక ఆటోలో వాటిని పంపిస్తున్నామని వాళ్లు చెప్పారు. ఆ తర్వాత ఒక ఆటో డ్రైవర్ ఒక పార్సిల్ తెచ్చి ఇచ్చి వెళ్లిపోయాడు. కరెంటు సామాన్లే కదా అని తులసి వాటిని మరుసటిరోజు విప్పి చూసింది. తీరా చూస్తే అందులో డెడ్ ఉండడంతో అవాక్కయింది.
ఆ డెడ్ బాడీ రాజమండ్రికి చెందిన 40 ఏళ్ల వ్యక్తిదని గుర్తించారు. గుర్తు తెలియనివిధంగా మొఖం చిధ్రం చేసి ఉంది. రాజమండ్రిలో హత్య చేసి ఈ పార్సిల్‌లో పంపినట్లు అనుమానిస్తున్నారు. లేకపోతే ఆటోలో తెచ్చిన వ్యక్తి ఏమైనా పథకం ప్రకారం ఇదంతా చేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తులసి కుటుంబ సభ్యులపైనా సందేహాలున్నాయి. పోలీసులు అందర్నీ విచారిస్తున్నారు. పార్శిల్ ఇచ్చిందెవరు అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు.