Andhrabeats

పుష్ప2 స్టార్ హోటల్ ఇడ్లీ లాంటిది: రామ్ గోపాల్ వర్మ

‘పుష్ప2: ది రూల్’పై (Pushpa2: The Rule) ఎక్స్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్టు చేశారు. ‘పుష్ప2′ టికెట్ ధరలను (Pushpa 2 Tickets Price) పెంచుకునేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీగా పెరిగిన టికెట్ ధరలపై కొన్ని వర్గాలు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ పోస్ట్ పెట్టారు. ధరలను నియంత్రించాలని కోరుతూ పలువురు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.’పుష్ప2’ టికెట్లను స్టార్ హోటల్ ఇడ్లీతో పోల్చారు.

సుబ్బారావు అనే ఒకడు హోటల్ పెట్టి.. ప్లేట్ ఇడ్లీ ధరను రూ.1000గా నిర్ణయించాడు. అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతావాటి కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ, కస్టమర్కు ఆ ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు అతడి హోటల్కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవరూ కాదు.”

సుబ్బారావు ఇడ్లి ధర సామాన్యులకు అందుబాటులో లేదు’ అని ఎవరైనా ఏడిస్తే, అది ‘సెవెన్స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు’ అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ ‘సెవెన్జర్ హోటల్లో యాంబియన్స్కి మనం ధర చెల్లిస్తున్నాం’ అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ క్వాలిటీ అనేదే సినిమా. డెమోక్రటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మిస్తారు. అంతేకానీ, ప్రజా సేవ కోసం కాదు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన బ్రాండెడ్ దుస్తుల ధరలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు”

ఇల్లు, తిండి, దుస్తులు ఈ మూడింటి కన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి ‘పుష్ప 2’ సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానేయొచ్చు, లేదా రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా? మళ్లీ సుబ్బారావు హోటల్ విషయానికొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు. అన్ని సీట్లు బుక్ అయిపోయాయి” అని పోస్ట్ పెట్టారు.

TOP STORIES