Andhrabeats

నాగచైతన్య, శోభిత పెళ్లి.. నాగార్జున భావోద్వేగం

అక్కినేని నాగచైతన్య ధూళిపాళ్ల శోభిత ఒక్కటయ్యారు. బుధవారం రాత్రి వారి పెళ్లి అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. వారి పెళ్లి ఫోటోలను నాగార్జున ఎక్స్ లో పోస్ట్ చేశారు.

“శోభిత, చై ఒక అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ప్రత్యేకం. ఇది భావోద్వేగమైన క్షణం. నా ప్రియమైన చైకి అభినందనలు. మా కుటుంబంలోకి శోభితను ఆనందంగా ఆహ్వానిస్తున్నాను. ఆమె ఇప్పటికే మా జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చింది.

ANR గారి శత జయంతికి గుర్తుగా స్థాపించబడిన ఆయన విగ్రహం పాదాల క్రింద ఈ వేడుక జరగడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ప్రయాణంలో అడుగడుగునా ఆయన ప్రేమ, మార్గదర్శకత్వం మాతో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రోజు అనేకమంది మాపై కురిపించిన ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని ట్వీట్చే చేశారు.

కొద్దిరోజుల క్రితమే హీరో నాగచైతన్య హీరోయిన్ శోభితతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు నేడు పెళ్లితో ఒక్కటయ్యారు. హల్దీ వేడుకలు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుని చేయడం వంటి వేడుకలు అక్కినేని కుటుంబంలో అంబరాన్నంటేలా జరిగాయి.

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వర రావు విగ్రహం ముందు వేసిన మండపంలో రాత్రి 8 గంటల 13 నిమిషాలకు పెళ్లి జరిగింది.

చైతు – శోభిత పెళ్లి ఇరు కుటుంబాలు, సన్నిహితులతో పాటు కేవలం అతి కొద్దిమంది సినీ ప్రముఖుల మధ్య మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకలు తెల్లవారుజాము వరకు జరిగేలా ఏర్పాటు చేశారు

TOP STORIES