నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఆయనను అరెస్ట్ చేశారు. రాయచోటి పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిపై ఆరోపణలు ఉన్నాయి. ఏపీ వ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి.
అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదైంది. 352(2) 111 R/W (3)5 బీఎన్ఎస్ యాక్ట్ 2023 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రాయచోటి పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. కాగా, కూటమి ప్రభుత్వం వచ్చాక.. పోసాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పేశారు.
హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ అపార్ట్ మెంట్ లో పోసానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసుల్లో పోసానిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. క్రైమ్ నెంబర్ 65/25 కింద కేసు నమోదైంది. ఏపీ నుండి ఒక ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన టీమ్ వచ్చి పోసానిని అదుపులోకి తీసుకుంది.
ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదైంది. సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదైంది. కులాల పేరుతో దూషించడం.. ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని పోసానిపై కేసు ఫైల్ అయ్యింది. అందులో భాగంగా ఏపీ పోలీసులు అరెస్ట్ వారెంట్ తో హైదరాబాద్ కు వచ్చారు. గురువారం ఉదయం రాజంపేట అడిషనల్ మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని హాజరుపర్చనున్నారు పోలీసులు. పోసానిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.