Andhrabeats

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ గుకేష్‌

భారత చెస్‌ ఛాంపియన్‌ గుకేష్‌ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా అవతరించి చరిత్ర సృష్టించాడు. అతి పిన్నవయసులో ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా మారిన అరుదైన ఘనత సాధించి దేశం కీర్తిని నిలబెట్టాడు. గురువారం జరిగిన ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో విజయం సాధించాడు.
భారత చెస్‌ ప్లేయర్‌ గుకేష్‌ ప్రపంచ ఛాంపియన్‌ ఫైనల్స్‌లో గేమ్‌ 14లో చైనా ఆటగాడు డింగ్‌ లిరెన్‌ను ఓడించాడు. గుకేష్‌ వయస్సు 18 సంవత్సరాలు. క్రీడా చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను గెలుచుకున్న లెజెండరీ విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత రెండో భారీతీయ గ్రాండ్‌ మాస్టర్‌గా నిలిచాడు.
18 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గుకేష్‌.. విశ్వనాథన్‌ ఆనంద్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. అతడి తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. చెన్నైకి చెందిన గుకేష్‌.. మే 29, 2006న జన్మించాడు. అతడి తండ్రి డాక్టర్‌ రజనీకాంత్‌ ప్రఖ్యాత ఈఎన్‌టీ నిపుణుడు. తల్లి డాక్టర్‌ పద్మ మైక్రోబయాలజిస్టు. ఏడేళ్ల వయసులో గుకేష్‌.. తన టాలెంట్‌ ను తొలిసారి బయటపెట్టాడు.
2015లో అతను  ఆసియా స్కూల్‌ ఆఫ్‌ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ అండర్‌–9 విభాగంలో గెలుపొందాడు. 2018లో ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించాడు. ఆసియా యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ఐదు బంగారు పతకాలను సాధించాడు. అతను 2017లో అంతర్జాతీయ మాస్టర్‌గా, రెండు సంవత్సరాల తర్వాత, చెస్‌ చరిత్రలో మూడవ అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్‌గా మారిన గుకేష్‌ ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. తాజాగా సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గుకేశ్‌ అద్భుత విజయాన్ని సాధించాడు.

TOP STORIES