Andhrabeats

ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసిన భార్య

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది ఒక భార్య. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం సోలిశెట్టిపల్లిలో ఈ దారుణం జరిగింది. గోవిందప్ప(38)కు 15 ఏళ్ల కిందట గుడుపల్లి మండలం పెద్దవంకకు చెందిన మీనాతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నెల 4 నుంచి భర్త కనిపించడం లేదంటూ 5వ తేదీన మీనా రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు.
బుధవారం భర్త గోవిందప్పతో కలిసి గొర్రెలు మేపేందుకు వెళ్లిన మీనా.. రాళ్లబూదుగూరుకు చెందిన ప్రియుడు ఆనంద్‌ను పిలిపించి గోవిందప్పను హత్య చేసింది. రాయితో తలపై కొట్టి ప్రాణాలు తీశారు. తర్వాత ఆనంద్‌.. మరో వ్యక్తితో కలిసి బైక్‌పై మృతదేహాన్ని తరలించి బిసానత్తం అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. అనంతరం తన భర్త కనిపించడం లేదని గ్రామస్తులను నమ్మించిన మీనా.. వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ భార్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో తమదైన శైలిలో విచారించడంతో గుట్టంతా బయటపడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.

TOP STORIES