Andhrabeats

బిగ్‌ షాట్స్‌కు టీడీపీ రాజ్యసభ సీట్లు

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా పారిశ్రామికవేత్తలు సానా సతీష్, బీద మస్తానరావులను పంపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎన్డీయే కూటమి తరఫున ఒక స్థానానికి బీజేపీ తన అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్యను ఇప్పటికే ప్రకటించింది. ఈ మూడు స్థానాలు వైఎస్సార్‌సీపీకి చెందినవి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీద మస్తానరావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్‌ కృష్ణయ్యలు అందులోకి జంప్‌ చేశారు. ఆర్థికంగా స్థితిమంతుడైన బీద మస్తానరావు రాజీనామా సమయంలోనే తిరిగి ఆ స్థానాన్ని తనకే కేటాయించేలా ఒప్పందం చేసుకుని టీడీపీలో చేరారు. ఆర్‌ కృష్ణయ్య సైతం మళ్లీ తనకే సీటు ఇచ్చే ఒప్పందంతో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ మేరకు వారిద్దరికీ తిరిగి రాజ్యసభ సీట్లు దక్కాయి. మోపిదేవి వెంకట రమణ రాజీనామా చేసిన స్థానాన్ని టీడీపీలో ప్రస్తుతం బలంగా ఉన్న సానా సతీష్‌కు కేటాయించారు. సానా సతీష్‌ గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటు ఆశించినా దక్కలేదు. కానీ సమీకరణల్లో ఆ సీటు పొందలేకపోయారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పదవిని ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీటు తెచ్చుకున్నారు. ఈ స్థానం కోసం మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహనరావులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. సానా సతీష్‌ లోకేష్‌కి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా మారడం, పార్టీలో ఇప్పుడు ఆయన చెప్పిన మాటే నడుస్తుండడంతో రాజ్యసభ అవకాశం ఆయనకే లభించింది.

TOP STORIES