బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం లభించింది. ఏపీ నుంచి బీజేపీ తరఫున ఈసారి ఆయన రాజ్యసభకు ఎంపికవనున్నారు. ఆర్ కృష్ణయ్యను తమ రాజ్యసభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది.
ఆర్ కృష్ణయ్య ఇటీవలే వైఎస్ఆర్సీపీకి రాజీనామా బీజేపీలో చేరారు. ఏపీలో జగన్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఎన్డీఏ కూటమితో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఆయన రాజీనామా చేసి తిరిగి బీజేపీ తరఫున రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నట్లు గతంలోనే వెల్లడింది. అందులో భాగంగానే బీజేపీ ఆయనను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. మొత్తం మూడు రాష్ట్రాల బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో ఆర్ కృష్ణయ్య కూడా ఉన్నారు.
కాగా కూటమి తరపున మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ రెండు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను త్వరలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.