Andhrabeats

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

హైదరాబాద్ లో  ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను  పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఇప్పటికే చాలా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా… హైదరాబాదులో ఉన్న వల్లభనేని వంశీని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. ఇవాళ ఉదయం అరెస్టు చేసిన తర్వాత విజయవాడకు వల్లభనేని వంశీని తరలిస్తున్నారు. అయితే ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్టు చేశారు ? ఎందుకు విజయవాడకు తీసుకువెళ్లారు ? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

వైసీపీ ప్రభుత్వంలో… తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వల్లభనేని వంశీ  పేరు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు అయింది. అందుకే అతనిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు.

వంశీ అరెస్ట్ లో నాటకీయ పరిణామాలు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, నాటకీయ పరిణామాల మధ్య, విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో గచ్చిబౌలిలోని మై హోం విల్లాలో అరెస్ట్ చేసారు. ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తితో నాలుగు రోజుల క్రితం టచ్ లోకి వచ్చారు. దీంతో నిఘాలో ఉన్న వంశీ ఎక్కడ ఉన్నారనే విషయం పోలీసులకు తెలిసింది.

బుధవారం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ వైసీపీ నేత ఫాం హౌస్ లో పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి వంశీ కూడా వచ్చారు. దీన్ని పసిగట్టిన విజయవాడ పోలీసులు, వంశీని వెంబడించారు. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో ఉన్న వంశీని పోలీసులు అరెస్ట్ చేసారు.

 

TOP STORIES