Andhrabeats

మీ జీవితాన్ని మార్చే రహస్యాలు

 

ఈ ఆధునిక యుగంలో జీవితాన్ని సంతోషకరంగా, సమర్థవంతంగా మార్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ దాన్ని ఎలా సాధించాలనే విషయంలో తడబడతారు. చిన్న చిన్న మార్పులతో మన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు. ఈ చిన్న మార్పులు మీ రోజువారీ జీవితంలో అద్భుతాలు సృష్టించగలవు. మన జీవనశైలిని, ఆరోగ్యాన్ని, కెరీర్‌ను ప్రభావితం చేస్తాయి.

1. చిన్న లక్ష్యాలతో పెద్ద విజయాలు

పెద్ద లక్ష్యాలు భయపెడతాయి. కానీ చిన్న లక్ష్యాలు మాయాజాలం చేస్తాయి. రోజూ ఒక చిన్న పనిని సాధించండి. అంటే ఉదాహరణకు 10 నిమిషాలు ధ్యానం, 15 నిమిషాలు నడక, లేకపోతే ఒక పుస్తకంలో ఒక పేజీ చదవడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పరిశోధనల ప్రకారం 21 రోజుల పాటు ఒక అలవాటును కొనసాగిస్తే అది మీ జీవితంలో భాగమవుతుంది. ఒక నోట్‌బుక్‌లో మీ రోజువారీ లక్ష్యాలను రాసి, వాటిని ట్రాక్‌ చేయడం మొదలుపెట్టండి ఈ చిన్న అడుగు మిమ్మల్రిన పెద్ద విజయాల వైపు నడిపిస్తుంది.

 

2. సానుకూల ఆలోచన : మీ మనసే మీ శక్తి

‘నేను సాధించగలను‘ అనే ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. సానుకూల ఆలోచనలు ఒత్తిడిని తగ్గిస్తాయి. మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం కృతజ్ఞతా అలవాటు ఉన్నవారు 25% ఎక్కువ సంతోషంగా ఉంటారు. ప్రతి రాత్రి నీవు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను ఒక డైరీలో రాయండి. ఉదాహరణకు కుటుంబం కోసం చేసిన పనులు, ఆరోగ్యం కోసం తీసుకున్న చర్యలు.. లేదా ఒక చిన్న సంతోష క్షణం. ఈ అలవాటు మీ దృక్పథాన్ని మార్చి జీవితాన్ని మరింత అందంగా చేస్తుంది.

 

3. సమయ నిర్వహణ : ‘ఐసెన్‌హోవర్‌ మ్యాట్రిక్స్‌’

సమయం మీ అతిముఖ్యమైన ఆస్తి. ‘ఐసెన్‌హోవర్‌ మ్యాట్రిక్స్‌’ వంటి టెక్నిక్‌లతో మీ పనులను ముఖ్యమైనవి, అత్యవసరమైనవిగా విభజించుకోండి. రోజు ప్రారంభంలో మూడు ముఖ్యమైన పనులను ఎంచుకుని, వాటిని మొదట పూర్తి చేయండి. ఇది మీ పనితీరును ప్రభావితం చేయడమే కాదు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉదాహరణకు, ఒక టు–డూ లిస్ట్‌ రాసి, ‘ఈమెయిల్స్‌ చెక్‌ చేయడం. ఫోన్, టీవీ చూడడం కంటే ‘మీప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ పూర్తి చేయడం, మీ ఉద్యోగంలో భాగమైన పనిని వెంటనే చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

 

4. ఆరోగ్యం: మీ శరీరం మీ ఆలయం

ఆరోగ్యం లేనిదే జీవితంలో ఏదీ సాధ్యం కాదు. రోజూ 30 నిమిషాలు వ్యాయామం, సమతుల ఆహారం, 7–8 గంటల నిద్రపోవడం. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక ప్రకారం. వారానికి 150 నిమిషాల మితమైన వ్యాయామం గుండె జబ్బుల ప్రమాదాన్ని 30% తగ్గిస్తుంది. ఉదయాన్ని ఒక గ్లాస్‌ నీటితో ప్రారంభించండి. కూరగాయలు తినడం, సాయంత్రం 10 నిమిషాలు యోగా చేయండి. ఈ చిన్న అలవాట్లు మీ శక్తిని, ఆయుర్దాయాన్ని పెంచుతాయి.

 

5. మీతో మీరు నిజాయితీ ఉండండి :

మీ కలల్లోనే జీవించండినీవు నిజంగా ఏమి కావాలనుకుంటున్నావు? ఇతరుల అంచనాల కోసం కాకుండా, నీ సొంత ఆనందం కోసం జీవించు. వారానికి ఒక గంట నీతో నీవు గడిపి, ‘నేను ఏమి సాధించాలనుకుంటున్నాను?‘ అని ఆలోచించు. నీ లక్ష్యాలు నీ విలువలతో సమానంగా ఉన్నప్పుడు, నీవు ఎక్కువ ప్రేరణతో, సంతృప్తితో ఉంటావు. ఒక కొత్త నైపుణ్యం నేర్చుకో, లేదా నీ కలల ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టు.

TOP STORIES