Andhrabeats

మెడిసిన్‌ స్ట్రిప్‌పై రెడ్‌ మార్క్‌ ఎందుకు ఉంటుంది?

Red strip in Medicine

ఏదైనా హెల్త్‌ ప్రాబ్లమ్‌ వస్తే, ప్రతి ఒక్కరూ కొన్ని రకాల మెడిసిన్‌ వాడతారు. సమస్య పెద్దదైతే, డాక్టర్‌ సూచించిన మందులు వాడాల్సి ఉంటుంది. అయితే చాలామంది మెడిసిన్‌ రేపర్‌పై ఏం రాసి ఉందో చదవరు.

నిజానికి మెడిసిన్‌ స్ట్రిప్స్‌ అన్నింటిపై కొన్ని సూచనలు రాసి ఉంటాయి. వాటిని బట్టి ఆ మెడిసిన్‌ ఎలా వాడాలో, ఎలా భద్రపరచాలో తెలుస్తుంది. కానీ చాలా రకాల మెడిసిన్‌ స్ట్రిప్స్‌పై ఎరుపు రంగు లైన్‌ ఉంటుంది. ఇది దేనికి సంకేతమని ఎప్పుడైనా ఆలోచించారా..?

రెడ్‌ స్ట్రిప్‌ ఉంటే..

మెడిసిన స్ట్రిప్‌పై రెడ్‌ మార్క్‌ గురించి ఫార్మసిస్ట్‌లు, వైద్యులు, మెడికోలకు తెలుస్తుంది కానీ.. సాధారణ ప్రజలకు దాని గురించి పెద్దగా వివరాలు తెలియవు. అయితే వైద్యులను సంప్రదించకుండానే మెడిసిన్‌ వాడేవారు వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. లేకపోతే సెడ్‌ ఎఫెక్టŠస్‌ బారిన పడాల్సి వస్తుంది. మెడిసిన్‌ రేపర్‌పై రెడ్‌ స్ట్రిప్‌ ఉంటే, తప్పకుండా వైద్యుల సలహాతోనే ఆ మందులు వాడాలని అర్థం. యాంటీ బయోటిక్స్‌ మితిమీరి వాడకూడదని ఇది సూచిస్తుంది. అలాగే వైద్యులు సూచించన డోసు మేరకే వాడాలి.

Rx అని ఉంటే?

మెడిసిన్‌పై ఖ్ఠ అని రాసి ఉంటే, కచ్చితంగా వైద్యులు సూచిస్తేనే వాటిని వాడాలి. లేదంటే కొన్ని దుష్ప్రభావాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

NRx అని ఉంటే..

స్ట్రిప్‌పై Nఖ్ఠ అని ఉంటే, అవి మత్తు కలిగించే మెడిసిన్‌ అని అర్థం. డాక్టర్లు రోగి జబ్బును బట్టి కచ్చితమైన అంచనాతో వాటిని సూచిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే వీటిని సిఫారసు చేస్తారు.

XRx అని రాసి ఉంటే..?

ఏదైనా టాబ్లెట్‌ ప్యాక్‌పై గీఖ్ఠ అని రాసి ఉంటే, వాటిని వైద్యుల సిఫార్సు ప్రకారమే వాడాలి. ఈ మెడిసిన్‌ను ఒకవేళ ఒకసారి డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌పై రాసి ఇచ్చినా..

రెండోసారి దుకాణదారులు దానిని లెక్కలోకి తీసుకోరు. రోగి మళ్లీ కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించి, వైద్యులు మళ్లీ వాటిని సిఫార్సు చేసి రాస్తేనే వాడాలి. ఈ మూడు గుర్తులను ఎప్పుడు మెడిసిన్‌ తీసుకున్నా మనం గమనించాలి.

ఇంకొన్ని సూచనలు

మెడిసిన్‌ను ఎంత మోతాదులో వాడాలనే విషయంపై కచ్చితంగా స్పష్టత ఉండాలి. తెలియకపోతే డాక్టర్‌ లేదా ఫార్మసిస్ట్‌ను అడగాలి. మెడిసిన్‌ డోస్‌ చిన్నపిల్లలకు ఒకలా, పెద్ద వాళ్లకు మరోలా ఉంటుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే వ్యాలిడిటీ తేదీ తప్పకుండా చెక్‌ చేయాలి. గడువు దాటిన మెడిసిన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడొద్దు.

అలాగే కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్‌ను ఫలానా చోటే భద్రపరచాలని స్ట్రిప్స్‌పై రాసి ఉంటుంది. ఉదాహరణకు కొన్ని దీర్ఘకాలిక జబ్బులకు సంబంధించిన మెడిసిన్‌ను కచ్చితంగా ఫ్రిడ్జ్‌ల్లోనే భద్రపరచాలి. కొన్నింటిని పిల్లలకు అందకుండా చూడాల్సి ఉంటుంది. డాక్టర్‌ సూచనలు పాటించకపోతే, కొందరికి అలర్జీస్‌ వస్తాయి.

మెడిసిన్‌ స్ట్రిప్‌ పాడైనా, రేపర్‌ చిట్లి టాబ్లెట్‌ బయటకు కనిపిస్తుంటే వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. మెడిసిన్‌ కచ్చితంగా ప్యాకేజ్‌డ్‌గా ఉండాలి. కొన్ని మెడిసిన్స్‌ పిల్లలు వాడకూడదు. వీటి కారణంగా చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మరణాలు కూడా సంభవించవచ్చు. అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి మెడిసిన్, ఎలా వాడాలో తెలుసుకోవడం మంచిది.

TOP STORIES