పుస్తక ప్రియులకు శుభవార్త. విజయవాడలోని 35 పుస్తక మహోత్సవం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పుస్తక మహోత్సవానికి వేదిౖMðంది. జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 11 రోజుల పాటు పుస్తక మహోత్సవం సాహితీ ప్రియులకు ఆనందం పంచనుంది. సుమారు 300కు పైగా ఏర్పాటు చేయనున్న రకరకాల బుక్ స్టాక్స్ సందర్శకులకు అందుబాటులో ఉంచుతున్నారు.
ఈ ఏడాది పుస్తక మహోత్సవ ప్రాంగణానికి సాహితీ పవజీవన్ లింక్స్ అ«ధినేత పిడికిటి రామకోటేశ్వరరావు పేరు పెడుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఏడాది ఆరుద్ర, దాశర«థీ కృష్ణమాచార్యులు, నాజర్ (బుర్ర కథ పితామహుడు), నార్ల చిరంజీవి, అలూరి బైరాగి, ఎన్ నటరాజన్(శారద), సినీ నటి భానుమతి తదితరుల శత జయంతి సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ నాకు నచ్చిన పుస్తకం, నన్ను ప్రభావితవ చేసిన పుస్తకంపై ఓపెన్ డయాస్‌పై సందర్శకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. జనవరి 6వతేది సాయంత్రం 4 గంటలకు పుస్తక ప్రియుల పాదయాత్ర సిద్దార్ధ కళాశాల నుంచి పుస్తక మహోత్సవం వరకు జరుగుతుంది. గతంలో రానటువంటి అంగ్ల ప్రచురణ కర్తలు, అనేక మంది పబ్లిషర్స్ బుక్ స్టాల్స్ ఏర్పాటు చేయటం ప్రత్యేకత.
రతన టాటా ప్రతిభ వేదికపైన విద్యార్థులకు ఈ పుస్తక మహోత్సవం జరిగే 11 రోజులు, ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వక్తృత్వం, ఇచ్చిన అంశంపై కథలు రాయటం, మిమిక్రీతో క«థలు చెప్పటం, వాక్‌ఫర్ బుక్స్, డ్రాయింగ్, ఓరెగమి, పుస్తక సమీక్షలు, క్విజ్, శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలపై ఉపన్యాసాలు, మన చుట్టూ సైన్స్ అండ్ మ్యాథ్స్, మేజిక్ లాజిక్, వంటి పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి టి.మనోహర నాయుడు మాట్లాడుతూ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అవరణలో జరిగే 35వ విజయవాడ పుస్తక మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సుమారుగా 238 బుక్ స్టాల్స్, మరో 65 వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పుస్తర అవిష్కరణలు, శత జయంతి సభలతో పాటుగా పలు సాహితీ కార్యక్రమాలు, చర్చా వేదికలు జరుగుతాయని తెలిపారు.