Andhrabeats

షాకింగ్‌ : కుక్కను వేటకొడవళ్లతో నరికి చంపారు

తిరుపతి నగరంలోని ఫిష్‌ మార్కెట్‌ ఎదురుగా ఉన్న స్కావెంజర్స్‌ కాలనీలో ఓ పెంపుడు శునకాన్ని అదే కాలనీకి చెందిన ఇద్దరు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపేశారు. కాలనీలో నివాసముంటున్న లావణ్య కొన్నేళ్లుగా శునకాన్ని పెంచుకుంటోంది. శుక్రవారం తిరుచానూరు పంచమి సందర్భంగా ఆమె గుడికి వెళుతూ శునకాన్ని ఇంటి వద్దే వదిలి వెళ్లింది. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఇద్దరు వేటకొడవళ్లతో అత్యంత కిరాతకంగా ఆ మూగజీవి ప్రాణం తీశారు. రోడ్డుపై వెళుతున్న వారిని చూసి శునకం మొరిగిందన్న నెపంతో శివకుమార్, సాయిలు ఈ దారుణానికి పాల్పడ్డారని లావణ్య భోరున విలపించారు. దీనిపై ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా కుక్కకు తల్లిదండ్రులు ఎవరు? వాటి పేర్లేంటి? అంటూ పోలీసులు వెటకారంగా మాట్లాడారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి.. శునకం కళేబరానికి తిరుపతి వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
మూగజీవులు, పెంపుడు జంతువులపై పైశాచికత్వాన్ని ప్రదర్శించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

TOP STORIES