Andhrabeats

సీనియర్ నటి పుష్పలత కన్నుమూత

Actress Pushpalatha dead

సీనియర్ నటి పుష్పలత కన్నుమూత

టాలీవుడ్ సీనియర్ నటి పుష్పలత (87) చైన్నైలో కన్నుమూశారు.

టీ.నగర్ లోని తిరుమల పిళ్లై రోడ్డులో నివాసం ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించారు పుష్పలత.

1958లో విడుదలైన సెంగోట్టై సింగం అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు పుష్పలత. ఆ తర్వాత 1961లో కొంగునాట్టు తంగం అనే సినిమాలో కథానాయికగా కనిపించారు. నానుమ్ ఒరు పెణ్ అనే సినిమాలో నటుడు ఏవీఎం రాజన్ కు జోడిగా నటించారు.

యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం, శ్రీరామ పట్టాభిషేకం, కొండవీటి సింహం వంటి చిత్రాల్లో నటించారు. ఏవీఎం సంస్థ నిర్మించిన రాము సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించారు పుష్పలత. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషలలోనూ నటించారు పుష్పలత.

1963లో మైన్ భీ లక్కీ హూన్ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నర్స్ అనే మలయాళ సినిమాలోనూ నటించారు. సకలకళా వల్లభన్, నాన్ అడిమై ఇల్లై వంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు.

TOP STORIES