మహానటి ఫేమ్ కీర్తి సురేష్ పెళ్లి గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితుడు, స్కూల్‌మేట్ ఆంటోని తట్టిల్‌ని కీర్తి పెళ్లాడింది. పెళ్లికి రెండు రోజుల ముందే వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి. ఆంటోనీ.. కీర్తి చిన్న నాటి మిత్రుడు. వ్యాపారవేత్తగా ఉన్న అతన్ని పెద్దల అంగీకారంతో కీర్తి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య 15 ఏళ్ల నుండి ప్రేమాయణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులు కీర్తి సురేశ్‌కు అభినందనలు తెలిపారు.