ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు కసరత్తు మొదలైంది. ఈ నెల 25వ తేదీ నుంచి బదిలీల ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ ప్రక్రియ చేపడుతున్నారు. జులైలో మిగిలిన అన్ని శాఖల బదిలీలు చేపట్టినా టీచర్ల బదిలీలు మాత్రం చేయలేదు. ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి వారి బదిలీలను ప్రత్యేకంగా తీసుకుని ఇప్పుడు రోడ్‌మ్యాప్ ప్రకటించింది ఏపీ విద్యా శాఖ.
ఇదీ రోడ్ మ్యాప్
– డిసెంబర్ 25, జనవరి 25, ఫిబ్రవరి 10న టీచర్ల ప్రొఫైల్ అప్‌డేషన్ ఉంటుందని తెలిపారు.
– ఫిబ్రవరి 15, మార్చి 1, మార్చి 15 తేదీల్లో సీనియారిటీ జాబితాను రిలీజ్ చేయనున్నారు.
– ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ వరకు హెడ్ మాస్టర్ల బదిలీలు, 21 నుంచి 25 మధ్య సీనియర్ అసిస్టెంట్ల బదిలీలు జరుగనున్నాయి.
– మే 1 నుంచి 10 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు పూర్తి చేస్తామని విద్యా శాఖ తెలిపింఇ.
– ఏప్రిల్ 16 నుంచి 20 వరకు హెడ్ మాస్టర్లు, మే 26 నుంచి 30 వరకు సీనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పిస్తారు.
– ఏప్రిల్ 26, 30వ తేదీల వరకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ఉంటుంది.
– జీవో 117కు సంబంధించిన వ్యవహారంలో ఇంకా ప్రభుత్వం ఎటూ తేల్చలేదు.
జీవో 117 ప్రకారం మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూల్స్‌లో విలీనం చేయడాని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అవి పూర్తి స్థాయిలో రద్దయిన తర్వాత ఎన్ని పోస్టులు ఖాళీ అవుతాయో తెలుస్తుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తైన తర్వాత ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని చెప్పొచ్చు.