Andhrabeats

ఏపీలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉంద‌ని.. ఇది భ‌విష్య‌త్తు నాలెడ్జ్ ఎకాన‌మీలో గేమ్ ఛేంజ‌ర్ అని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్ష‌న్స్‌లో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ‌, ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌ను కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, రాష్ట్ర మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డుల శాఖ మంత్రి  జ‌నార్ధ‌న్ రెడ్డి త‌దిత‌రుల‌తో క‌లిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంత‌రం ఆయన మాట్లాడుతూ..

• భవిష్యత్తులో డ్రోన్లు గేమ్ ఛేంజ‌ర్లుగా చెప్పొచ్చు. వ్యవసాయం, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ త‌దిత‌రాల్లో వాటిని వినియోగించవచ్చు.

• విజిబుల్ పోలీసింగ్…ఇన్ విజిబిల్ పోలీస్ కు ప్రాధాన్య‌మిస్తున్నాం. టెక్నాల‌జీ స‌హాయంతో నేర‌గాళ్ల ఆట‌క‌ట్టిస్తాం. ప్రతి అంశంలోనూ ఖచ్చితత్వాన్ని సాధించడంతో పాటు చివరి మైలు వ‌ర‌కు అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాలు అందించ‌డంలో టెక్నాల‌జీని వినియోగించుకుంటాం. 

• భూసార పరీక్షలు, పురుగుమందుల పిచికారీ, భూ సర్వే, భూసార ప‌రీక్ష‌లు త‌దిత‌రాల‌ను డ్రోన్ల ద్వారా నిర్వహించవచ్చు. కనీసం 100 నుండి 150 వరకు డ్రోన్ అప్లికేష‌న్స్ (డ్రోన్ యూజ్ కేస్‌లు) వినియోగం ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నాం. అప్లికేష‌న్స్‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రీక్షించి ఆయా కంపెనీల‌కు స‌రైన విధంగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చేలా పైలట్ ప్రాజెక్టుల‌కు వీలుక‌ల్పిస్తాం.

• నాకు కావాల్సింది డ్రోన్ల ద్వారా అభివృద్ధి. ఇండియా కు రెండంకెల వృద్ధిరేటు సాధించే స‌త్తా ఉంది. నాలెడ్జ్ ఎకానమీలో గ్లోబల్ సర్వీస్‌లు అందించ‌గ‌ల సత్తా కూడా మన దేశానికి ఉంది. 

• పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తల నుండి సలహాలు, సూచలను తీసుకుని డ్రోన్ పాలసీని ప్రవేశపెడతాం. 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీని ఆవిష్క‌రిస్తాం. కనీసం 35 వేలకు పైగా డ్రోన్ ఫైలట్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.  డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా అమరావతిని తీర్చిదిద్దుతాం.

• ఏఐ, ఎమ్ఎల్.. ప్రతి ఒక్కరి జీవితాల‌ను ప్రభావితం చేస్తాయి. మీ అందరికీ ఒక సూచన ఇస్తున్నా…థింక్ గ్లోబ‌ల్లీ.. యాక్ట్ గ్లోబ‌ల్లీ విధానాన్ని అనుస‌రించాలి.

• ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తాం. అక్కడ డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తే పెద్ద నగరాలైన హైదరబాద్, చెన్నై, బెంగళూరు, అమరావతికి దగ్గరగా ఉంటుంది. అక్కడ డ్రోన్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ కు సహకారం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 

• నేను డ్రోన్లు తయారీదారులకు కూడా చెప్తున్నా….మీకు నేను అంబాసిడర్ గా ఉంటాను….మీ మార్కెట్ ను ప్రమోట్ చేస్తా. నేను చాలా మంది ప్రధానులను చూశాను కానీ టెక్నాలజీని ఇంతగా అర్థం చేసుకునే వ్యక్తి ప్రధాని మోదీ. స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో విధానాల రూప‌క‌ల్ప‌న‌కు సిద్ధంగా ఉన్నాం.

• స్టూడెంట్స్, టీచర్స్, ప్రొఫెసర్స్ కు కూడా చెప్తున్నా నాలెడ్జ్ ఎకానమీకి ఇది మంచి సమయం. ప్రతిదీ అదుబాటులో ఉంది. ప్రతి దాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆలోచిస్తే ఇండియన్స్ ను ఎవరూ ఎదుర్కోలేరు. నేడు మ‌న దేశం యువ జ‌నాభా త‌ద్వారా యంగ్ టాలెంట్‌తో తొణికిస‌లాడుతోంది.

• కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టెక్నాలజీ, ఇన్నోవేషన్ లో భాగ‌స్వాముల‌వుతున్నారు. స‌మ‌ష్టి భాగ‌స్వామ్యంతో రాష్ట్రాన్ని డ్రోన్ హ‌బ్‌గా మారుస్తాం.

• రాష్ట్రంలోని యూనివర్సిటీలు కూడా థియ‌రిటిక‌ల్ విద్యకే కాకుండా అప్లికేష‌న్స్‌కు ప్రాధాన్య‌మివ్వాలి. న‌వ టెక్ ఆవిష్క‌ర‌ణ‌లు దిశ‌గా యువ‌త‌ను ప్రోత్స‌హించాలి. రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేస్తున్నాం.అమరావతిలో హెడ్ క్వార్టర్ ఉంటుంది.. మిగతావి విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నాం. 2047 నాటికి ఒక కుటుంబం…ఒక వ్యాపారవేత్త ఉండాలన్నది నా అభిమతం. 

• 25 ఏళ్ల క్రితం ప్రతి కుటుంబంలో ఒక ఐటీ వ్యక్తి ఉండాలని ఆకాంక్షించాని.. అదే విధంగా ఇప్పుడు చెప్తున్నా ఒక కుటుంబంలో ఒక వ్యాపారవేత్త, ఒక స్టార్టప్ కంపెనీ ఉండాలని చెప్తున్నా. ఇది సక్సెస్ అయితే భార‌త్‌.. టెక్నాల‌జీ, గ్లోబ‌ల్ స‌ర్వీసెస్‌లో ముందుంటుంది.

TOP STORIES