Andhrabeats

ఒక్క రోజు ముందుగానే ’లక్కీ భాస్కర్‌’

దుల్కర్‌ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ’లక్కీ భాస్కర్‌’ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న లక్కీ భాస్కర్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తెలుగులో రూపొందిన ఈ సినిమాను మలయాళంలోనూ భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దుల్కర్‌ సల్మాన్‌కి తెలుగులో ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో భారీ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నట్లుగా నిర్మాత నాగ్‌ అశ్విన్‌ ప్రకటించారు. ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత సినిమా స్థాయి పెరిగింది. అందుకే సినిమాకి ప్రీమియర్‌ షోలు వేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ వస్తే పర్వాలేదు.. ప్రీమియర్‌ షోలు చూసిన వారికి సినిమా నచ్చకుంటే నెగటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అవుతుంది. దాంతో రిలీజ్‌ తర్వాత వసూళ్లపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది నిర్మాతలు, ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల నిర్మాతలు, భారీ చిత్రాల నిర్మాతలు పెయిడ్‌ ప్రీమియర్‌లపై ఆక్తి కనబర్చరు. కానీ దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ కి చాలా నమ్మకం ఉన్నట్లు ఉంది. అందుకే లక్కీ భాస్కర్‌ను ఏకంగా వందకు పైగా స్క్రీన్లలో పెయిడ్‌ ప్రీమియర్‌కి రెడీ చేశారు. సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తే ప్రీమియర్‌ షోల వల్ల మరింత లాభం దక్కే అవకాశాలు సైతం ఉన్నాయని నిర్మాత నాగవంశీ కొత్త లెక్కలు వేస్తున్నారని తెలుస్తోంది.

లక్కీ భాస్కర్‌ సినిమా పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌తో రూపొందిన సినిమా. సినిమాలో హీరో దుల్కర్‌ సల్మాన్‌ డబ్బును ప్రేమిస్తాడని, ఆ డబ్బు కోసం ఎంతకైనా తెగించి పోరాటం చేసే వ్యక్తిగా ఆయన్ను చూస్తారంటూ దర్శకుడు వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమాలో విభిన్నమైన పాయింట్‌ను చూపించామని, తప్పకుండా సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని, హీరో పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండటంతో పాటు ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుందని అంటున్నారు. సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌కి ఏమాత్రం తగ్గకుండా హీరోయిన్‌ మీనాక్షి చౌదరి పాత్ర ఉంటుందని, ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసే విధంగా నటనతో మెప్పించారని దర్శకుడు అన్నారు.

ReplyForwardAdd reaction

TOP STORIES