Andhrabeats

చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు

చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పిల్లల నమోదు గణనీయంగా తగ్గడంతో వేలాది ప్రసిద్ధ కిండర్‌ గార్టెన్లు (పాఠశాలలు) మూతపడుతున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం 2023లో పాఠశాలల సంఖ్య 14,808 తగ్గి 2,74,400కి పడిపోయిందని చైనా విద్యా మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక పేర్కొంది.

చైనా జననాల రేటు పడిపోవడం తాజా సూచికలో ఇది వరుసగా రెండోసారి. జనాభా సంక్షోభ ప్రభావం ముఖ్యంగా విద్యతోపాటు అనేక రంగాలపై పడుతున్నట్లుగా కనిపిస్తోంది. కిండర్‌ గార్టెన్‌లో చేరిన పిల్లల సంఖ్య వరుసగా మూడో సంవత్సరం క్షీణించింది. మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. గత ఏడాది 11.55 శాతం లేదా 5.35 మిలియన్లు తగ్గి 40.9 మిలియన్లకు చేరుకున్నాయని హాంకాంగ్‌లోని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ నివేదించింది.

వరుసగా రెండో ఏడాది క్షీణించిన జనాభా :
అలాగే, ప్రాథమిక పాఠశాలల సంఖ్య కూడా 5,645 తగ్గి 143,500కి 2023లో 3.8 శాతం పడిపోయింది. ఈ క్షీణత చైనాలో విస్తృత జనాభా మార్పును సూచిస్తుంది. ఇక్కడి జనన రేట్లు, మొత్తం జనాభా రెండూ తగ్గుతూనే ఉన్నాయి. భవిష్యత్‌ ఆర్థిక వృద్ధికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. ఇది ఇప్పటికే మందగిస్తోందని పోస్ట్‌ నివేదిక పేర్కొంది. గత ఏడాదిలో చైనా జనాభా వరుసగా రెండో సంవత్సరం 1.4 బిలియన్లకు పడిపోయింది. రెండు మిలియన్లకు పైగా క్షీణించింది. 2023లో చైనాలో 9 మిలియన్ల జననాలు మాత్రమే నమోదయ్యాయి. 1949లో రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి అతి తక్కువ సంఖ్యగా చెప్పవచ్చు.

2050 నాటికి 500 మిలియన్లకు జనాభా :
తగ్గుతున్న జననాల రేటు ఫలితంగా చైనా గత ఏడాదిలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. చైనా జంటల సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఒకవైపు జననాల రేటు, సంతానోత్పత్తి రేట్లు పడిపోయినప్పటికీ, వృద్ధుల జనాభాలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల చైనా జనాభా 2023 చివరినాటికి 300 మిలియన్లకు చేరుకుంది. 2035 నాటికి 400 మిలియన్లను దాటి 2050 నాటికి 500 మిలియన్లకు చేరుకుంటుందని అంచనాలు సూచిస్తున్నాయి. కిండర్‌ గార్టెన్‌లు సీనియర్‌ సిటిజన్‌ల సంరక్షణ కేంద్రాలుగా మారిపోతున్నాయి. పాఠశాల సిబ్బందిలో చాలా మందిని వృద్ధుల సంరక్షణ కోసం నియమించారు

TOP STORIES