సూర్యోదయం ముందు ఉదయం నిద్ర లేవాలి. ఉదయం నిద్ర లేవగానే
ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లు లేదా రాగి పాత్రలో నీళ్లు తాగాలి. నీళ్లు ఎప్పుడు తాగిన గుటక, గుటక మింగుతూ నిదానంగా సిప్ చేస్తూ తాగాలి, నీళ్లు ఎప్పుడు తాగిన కూర్చొని తాగాలి, నిలబడి నీళ్లు తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, వాష్ రూమ్ వెళ్లి వచ్చిన తర్వాత నీళ్లు తాగితే మూత్ర సంబంధ వ్యాధులు వస్తాయి. ఉదయం పరగడుపున, మీరు తాగే నీళ్లలో ఒక గ్లాసులో నిమ్మరసం పిండుకొని తాగండి. ఉదయం పరగడుపున టీ కాఫీలు తాగితే ఎసిడిటీ అవుతుంది. మీకు తాగే అలవాటు ఉంటే టిఫిన్ చేసిన తర్వాత తాగండి. ఉదయం పరగడుపున తాగాలంటే కషాయాలు తాగాలి. అన్నం తిన్న తర్వాత 500 అడుగుల నడవాలి దీనివల్ల పొట్ట రాదు తిన్న ఆహారం తొందరగా అరుగుతుంది. రోజుకు పదివేల అడుగులు కనీసం నడవాలి. వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది. ఆహారంలో అయోడిన్ సాల్ట్ వాడకుండా సైంధవ లవణం వాడాలి. రిఫండ్ ఆయిల్, వంటలో వాడకూడదు. నెయ్యి ఆముదము నువ్వుల నూనె వేరుశనగ నూనె కుసుమ నూనె వాడడం మంచిది. రాత్రి భోజనంలో అన్నము పెరుగు, రాజమా కర్రీ తినకూడదు. రాత్రి హెవీగా భోజనం చేయడం వలన మధుమేహం, బిపి ఒబైసిటీ మలబద్ధకం మొదలగునవి సమస్య వస్తాయి. ప్రతిరోజు ఒక ఆపిల్ తినండి. మధ్యాహ్నం అన్నం తినడానికి అరగంట ముందు సలాడ్స్ తినండి. వాత నొప్పులు ఉన్నవాళ్లు మినప్పప్పుతో చేసిన వంటలు తినకూడదు, క్యాబేజీ క్యాలీఫ్లవర్ పెరుగు, రంగురంగుల పండ్లుకూరగాయలు తినాలి. ఉదాహరణకు క్యారెట్టు, బీట్రూట్ బొప్పాయి, ఆరెంజ్ ఆపిల్ మొదలగునవి. డైనింగ్ టేబుల్ మీద భోజనం వల్ల పొట్ట పెరుగుతుంది. భోజనం ఎప్పుడు చేసినా నేలపై కూర్చుని, సుఖాసనంలో కూర్చుని తినాలి. దీనివల్ల జఠరాగ్ని తీవ్రంగాఉంటుంది. సగం జఠ రాగ్ని తగ్గుతుంది. ఇక నిలబడి తింటే జఠ రాగ్ని పూర్తిగా తగ్గును శరీరంలో చక్రములు ఉన్నాయి. చక్రము వెనుక భాగంలో ఉన్నది అది సుఖాసనంలో మాత్రమే ప్రదీప్త మవుతుంది. తూర్పు వైపు తలపెట్టి ఎవరు పడుకోవాలి:- సాధువులు సన్యాసులు బ్రహ్మచరం పాటించేవారు గృహస్తులు కాని వారు. గృహస్తులు వివిధ వృత్తులు ఉద్యోగులు, విద్యార్థులు మీరందరూ దక్షిణం వైపు తల పెట్టుకోవాలి ఎత్తు తక్కువ ఉన్న పిల్లల దక్షిణము వైపు పడు కోడడం వల్ల మూడు నాలుగు సంవత్సరంలో మార్పు వస్తుంది. తాంబూలం వేసుకోవాలి తమలపాకులు పిత్తము కఫం ఉంటది సున్నం లో వాతాన్ని తగ్గిస్తుంది నమిలి మింగాలి. ఉదయం పూట పండ్ల రసాలు, మధ్యాహ్నం మజ్జిగ రాత్రి పాలు తాగాలి దీనివలన ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి. మీరు చేసిన భోజనం కుళితే కొలెస్ట్రాల్ తయారవుతుంది. కుళ్ళిన భోజనం యొక్క బై ప్రోడక్ట్ కొలెస్ట్రాల్ భోజనం పూర్తిగా అరిగిపోతే కొలెస్ట్రాల్ అసలు ఉండదు. మంచి కొలెస్ట్రాల్ HDL , చెడు కొలెస్ట్రాల్, LDL, VLDL
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు మోకాళ్ల నొప్పులు, మోకాలు బిగిసిపోయి కొద్ది దూరం కూడా నడవడం కష్టం అవుతుంది ఒక చిన్న పొరపాటు వల్ల 103 వ్యాధులు వస్తున్నాయి. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదు. ఆహారం వండిన 48 నిమిషాల లోపల తినాలి. జొన్నలు రాగులు సజ్జలు మొదలగునవి ఏడు రోజుల లోపల మాత్రమే ఉపయోగించాలి. గోధుమపిండి 15 రోజుల్లో పడి ఉపయోగించాలి. తిరగలి ఉపయోగించడం వలన చాలా లాభం. ప్రతిరోజు 15 నిమిషాలు ఉపయోగిస్తే బరువు మూడు నెలల్లో
15-20, 20 కిలోలు తగ్గుతారు. తిరగలి వాడడం వలన, భుజాల నొప్పులు మెడల నొప్పులు షుగర్ బిపి ఉండవు హార్మోన్లు చక్కగా తయారవుతాయి. నార్మల్ డెలివరీ అవుతది మహిళలకు. రెండుపూటల పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగ అన్నం లో కలుపుకొని తినేవారు ఆరోగ్యంగా ఉంటారు. రాత్రి వండిన అన్నంలో లేదా మిల్లెట్స్ లో పాలు తోడు పెట్టండి. ఉదయం అల్పాహారం బదులు ఆ సద్ది అన్నంలో ఉల్లిపాయలు పెట్టుకొని తినండి. దీనివలన చాలా సమస్యలు తగ్గుతాయి. 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయండి ఉపవాసం చేసే రోజు నిమ్మరసము కొబ్బరి నీళ్లు తాగవచ్చు. భోజనం చేసే సమయంలో మాట్లాడుతూ తినకండి. మీరు తినే ఆహారం ముందు దృష్టి పెట్టి తినాలి. రాత్రి ఎక్కువసేపు మేలుకోవద్దు దీనివలన అనారోగ్య సమస్యలు కలుగుతాయి.