Andhrabeats

డీప్‌ టెక్నాలజీ అంటే

ఏపీ ప్రభుత్వం డీప్‌ టెక్నాలజీకి సంబంధించి అమరావతిలో ఒక ఐకానిక్‌ బిల్డింగ్‌ కట్టించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై సమీక్ష నిర్వహించి ఇందుకు సంబంధించిన ప్రాజెక్టును చేపడతామని ప్రకటించారు. దీంతో అసలు డీప్‌ టెక్నాలజీ అంటే ఏమిటనే చర్చ జరుగుతోంది.
డీప్‌ టెక్నాలజీ (DEEP TECHNOLOGY) అనేది ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదం. ఇది ఒక అడ్వాన్సుడు టెక్నాలజీ. DEEP  ‘డేటా, ఎల్గోరిథమ్స్, ఎలక్ట్రానిక్స్, ప్రోగ్రామింగ్‌‘ అనే నాలుగు ముఖ్యమైన భాగాలు కలిసిన టెక్నాలజీ అని అర్ధం. దాని ఎబ్రివేషన్‌ అదే.
డేటా అంటే సమాచారం. ఉదాహరణకు ఏ వ్యాధితో ఐదేళ్ళ లోపు పిల్లలు చనిపోతున్నారు, దేశంలోని ఏ ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి, ఎలాంటి ఆహారం తీసుకునే వారిలో నిరోధకత ఎక్కువ ఉంటోంది.. ఇదంతా డేటా.
ఎలక్ట్రానిక్స్‌ ద్వారా ఈ డేటాని మనం సేకరించడం, ప్రాసెస్‌ చేయడం చేస్తాం. డ్రోన్లు, IOT పరికరాలు ఈ కోవలోకి వస్తాయి.
డేటాని విశ్లేశించడం ద్వారా ఒక మామూలు పరికరాన్ని స్మార్ట్‌గా మార్చవచ్చు. అంటే ఉదాహరణకు మీరు ప్రతిరోజు 8 గంటలకు ఇంటికి వస్తారు. మీరు వచ్చే సమయానికి ఏసీ ఆన్‌ అయ్యి, గది చల్లబడడం, గీజర్‌ ఆన్‌ అయ్యి వేడి నీళ్లు సిద్ధంగా ఉండడం, మీరు ఎలక్ట్రిక్‌ కారు వాడుతుంటే మీ ప్రయాణ సమయాన్ని బట్టి ఛార్జింగ్‌ చేయడం వంటివి అల్గోరిథమ్‌ నిర్ణయిస్తుంది.
ఫోన్లో మీ వాల్‌ పేపర్‌ మీ మూడ్‌ ని బట్టి, మీ పుట్టినరోజుని బట్టి, మీ జీవితంలో స్పెషల్‌ రోజులని బట్టి మారితే ఎలా ఉంటుంది? అలా మారాలి అంటే మీ గురించి దానికి తెలియాలి. అదే డేటా. మీ పుట్టినరోజు కాబట్టి ఏం వాల్‌ పేపర్‌ పెట్టాలో అల్గోరిథమ్‌ నిర్ణయించుకుంటుంది. అందుకోసం మీ వయసు, మతం, మీ ప్రాంతం బట్టి ఒక కల్చరల్‌ ప్రొఫైల్‌ బిల్డ్‌ చేసుకుంటుంది. ఇదంతా ప్రాసెసింగ్‌.
డీప్‌ టెక్నాలజీ అనేది లేకుంటే టన్నుల టన్నుల డేటాను మనం విశ్లేషంచుకోలేం. చీకట్లో రాయి వేసి తగులుతుందో లేదో మనమే నిర్ణయించుకోవాలి. అదే DEEP ఉంటే గతంలో ఇలాంటి ప్రాక్టిస్‌ చేసిన వాళ్ల అనుభవాలు ప్రాసెస్‌ చేసి చూసి మనం చేస్తే అది జరుగుతుందో సూచిస్తుంది.

TOP STORIES