డాక్టర్ ఇంట్లో పనిమనిషిగా చేరి, పని చూపించిన యజమాని ఇంటికే కన్నం వేసిన ఘటన మంగళగిరిలో వెలుగు చూసింది
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు బైపాస్ పక్కన గల మిడ్ వ్యాలీ సిటీలో ఓ డాక్టర్ ఇంట్లో చెంగపు వెంకటరమణ అనే మహిళ పనిమనిషిగా చేరి సుమారు 37 లక్షల రూపాయల నగదు, ఒక డైమండ్ నల్లపూసల గొలుసును చోరీ చేసింది
కాగా ఈ ఏడాది జులై నెల నుండి దశల వారీగా కొద్ది మొత్తంలో నగదు దొంగిలిస్తున్న పనిమనిషి చేతివాటానికి డైమండ్ నల్లపూసల గొలుసు చెక్ పెట్టింది
సదరు చోరీ ఫిర్యాదుపై మంగళగిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులు దొంగిలించిన నగదును, చోరీ నగదుతో కొనుగోలు చేసిన వస్తువులను రికవరీ చేసి మీడియాకు ప్రదర్శించారు
ఈ సందర్భంగా డిఎస్పి మురళీకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చోరీ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు