హైదరాబాద్ కు చెందిన సాగి వెంకట నరసింహ రాజు(54) కి విజయవాడ లోటస్ సెక్టర్-1 పృద్వి అపార్ట్మెంట్ లో ప్లాట్ ఉంది. యనమలకుదురు ప్రాంతానికి చెందిన మహ్మద్ రఫీ. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కావడంతో కలిసి మద్యం సేవించారు. మాట మాట పెరగడంతో మహ్మద్ రఫీ, వెంకట నర్సింహ రాజుని కత్తెరతో పొడవబోయాడు. రాజు తప్పించుకుని తన వద్దనున్న టవల్ తో రఫీ మెడకు వేసి నులిమాడు. దీంతో రఫీ మృతి చెందాడు. ఘటనపై పోలీసులకు నరసింహరాజు ఫోన్ చేయడం విశేషం. తన స్నేహితుడు చావుకు తానే కారణమయ్యానంటూ కన్నీరుమున్నీరయ్యాడు. రఫీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఎందుకు చంపాడో వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు.