సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సినీ నటి సమంత ఎప్పుడూ కొత్త విషయాలు పంచుకుంటారు. తాజాగా మరో కొత్త అంశాన్ని వెల్లడించారు. నాగ చైతన్యతో విడాకులు ప్రకటించిన సమయంలో కొందరు తనను ‘సెకండ్ హ్యాండ్’, ‘యూస్డ్’ అని కామెంట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే ఫెయిల్యూర్‌గా పరిగణిస్తారని, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం మహిళలు, వారి కుటుంబాలకు కష్టంగా ఉంటుందని తెలిపారు. తనపై చాలా రూమర్స్ వచ్చాయని, అవి నిజం కాదని చాలా సార్లు చెప్పాలనిపించింది కానీ చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదని ఆగిపోయానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.