నేను జనరల్ గా సినిమాలకు తప్ప ఓటీటీలకు రివ్యూలు ఇవ్వను.. కానీ ఈ వికటకవి వెబ్ సిరీస్ చూసిన తర్వాత దీని గురించి మనం ఖచ్చితంగా ప్రేక్షకులకు చెప్పొచ్చనిపించింది. జీ5 ఓటీటీలోకి నిన్న స్ట్రీమింగ్‌కు వచ్చిన డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి. ఏం థ్రిల్లర్ సిరీస్ ఇచ్చారండి ప్రదీప్ మద్దాలి వికటకవి రూపంలో. సూపర్ త్రిల్లింగ్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు. శుక్రవారం ఉదయం మొదలుపెట్టి కంటిన్యూగా సీరియస్ చూశాను. అద్భుతం అసలు.. సూపర్.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కొన్ని స్లో అయ్యాయి తప్ప అసలు వంక పెట్టడానికి నాకు ఏమీ కనపడలేదు. అమరగిరి, దేవతల గుట్ట ప్రాంతాలతో ట్రావెల్ అయ్యాను..ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే సాధారణంగా ఒకరకమైన క్యూరియాసిటీ ఉంటుంది. ఇలాంటి జోనర్‌లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఎంత థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ నెరేషన్‌తో తెరకెక్కిస్తే అవి అంత బాగా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఈ విషయంలో తెలుగులో వచ్చిన డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి చాలా వరకు విజయం సాధించిందనే చెప్పుకోవాలి. అమరగిరిలో వచ్చే సీన్లు, దేవతల గుట్ట శాపం, అక్కడికి వెళ్లిన 32 మంది వింతగా ప్రవర్తించడం వంటి సీన్లతో వెబ్ సిరీస్‌పై మంచి క్యూరియాసిటీ కలిగించారు. 1970 బ్యాక్ డ్రాప్‌లో కథ ఉంటుంది కాబట్టి దానికి తగినట్లుగా చేసిన వర్క్ బాగుంది. ఆ సమయానికి తగినట్లుగా సీన్స్, ప్రదేశాలు, సినిమాటోగ్రఫీ బాగుంది..రామకృష్ణగా డిటెక్టివ్ పాత్రలో నరేశ్ అగస్త్య పర్ఫెక్ట్‌గా యాప్ట్. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మేఘా ఆకాశ్ హుందాగా కనిపించింది. ముక్తార్ ఖాన్, అమిత్ తివారీ, షైజు, జమిందార్ రఘుపతి గా రఘు కుంచె, పూజారిగా అశోక్ కుమార్ తదితరులు పాత్రల మేర చక్కగా నటించారు. 40-50వ దశకం.. అప్పటి వాతావరణాన్ని చూపించడానికి టీమ్ పడిన కష్టం స్ర్కీన్‌పై కనిపించింది. తెలంగాణ యాస సంభాషణలు, కాస్ట్యూమ్స్ ఆనాటి నేటివిటీకి అద్దం పట్టాయి. థ్రిల్లర్ సిరీస్‌లకు రచయిత, దర్శకులు పాటించే సూత్రం చివరి వరకు సస్పెన్స్ మైంటైన్ చేయడం తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉన్నా కూడా బాగుంది..వికటకవిని రూపొందించిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి – కథా రచయిత తేజ దేశ్‌రాజ్‌లను అభినందించాలి. దర్శకుడు కథను ఎక్కడా పక్కదారి పట్టించలేదు. టెక్నికల్‌గా మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు. కథను క్రిస్పీ గా ముందుకు నడిపించాడు. 1970లో కథ మొదలై, 1940కు వెళ్లి మళ్లీ 70కు వస్తుంది. ఆ జానర్ వల్ల ఈ సిరీస్ కొత్తగా ఉంది. ఒక థ్రిల్లింగ్ సిరీస్‌కు కావాల్సిన సెటప్ క్రియేట్ చేయడమే కాదు.. మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే ఇచ్చారు. బడ్జెట్ పరిమితి పలు సన్నివేశాల్లో కనిపించింది. కెమెరా వర్క్ బావుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం కథకు పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయింది. ఆర్‌ఆర్ స్లోగా కథలో లీనం చేసేలా ఉంది. ఇందులో అసభ్యకర సంభాషణలు, సన్నివేశాలు ఒక్కటి కూడా లేదు. కుటుంబంతో కలిసి హాయిగా చూసే చక్కని సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. అస్సలు మిస్ అవ్వద్దు…
– గరగ త్రినాధరావు