పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ 2.0 ప్రాజెక్టుకి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇకపై క్యూఆర్ కోడ్‌తో పాన్ కార్డ్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ చేస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించిన పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. రూ.1,435 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.
ఇది టాక్స్ పేయర్లకు (పన్ను చెల్లింపుదారులు) మరింత మెరుగైన సర్వీసులు అందించేందుకు తోడ్పడనుంది. ఈ పాన్‌ను ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించిన అన్ని డిజిటల్ సిస్టమ్స్‌లో.. కామన్ బిజినెస్ ఐడెంటిఫయర్‌గా (సామాన్య వ్యాపార గుర్తింపు) చేసేందుకు ఈ ప్రాజెక్టును ప్రకటించింది.
ఈ పాన్ 2.0. ప్రాజెక్ట్ ద్వారా.. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల్ని సాంకేతికంగా మార్పు చేస్తారు. దీంతో సులువుగా, వేగంగా, మెరుగైన నాణ్యతతో సేవలు అందించేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.
దీని కింద భారతీయులు.. మళ్లీ కొత్త పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే జారీ చేసిన పాన్ కార్డుల్ని క్యూఆర్ కోడ్‌తో ఉచితంగానే అప్‌గ్రేడ్ చేయనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.