ఆ దున్నపోతు పేరు అన్మోల్. వెల కట్టలేనిదని దాని అని అర్థం. యముని వాహనంలా గంభీరంగా కనపడుతున్న ఈ దున్నపోతు విలువ కూడా వెల కట్టలేనిదే. దీని ధర అక్షరాలా 23 కోట్ల రూపాయలు.
హరియాణాలోని సిర్సా జిల్లాకు చెందిన గిల్ అనే రైతు వద్ద ఉంది ఈ దున్నపోతు. దీని బరువు 1500 కిలోలు. మేలు జాతి జీవం కావడంతో దీని వీర్యానికి బోలెడంత డిమాండ్ ఉంది. అన్మోల్ వీర్యాన్ని అమ్మడం ద్వారా దీని యజమాని గిల్ నెలకు రూ.5 లక్షల దాకా సంపాదిస్తున్నాడు.
దీన్ని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా అంత ఆదాయం సంపాదించాలంటే.. అందుకు తగ్గ ఖర్చు కూడా ఉంటుంది. రోజూ పావుకిలో బాదం పప్పులు, నాలుగు కిలోల దానిమ్మ గింజలు, 30 అరటిపండ్లు, 5 లీటర్ల పాలు, 20 గుడ్లు పెడతారు. రోజుకు రెండుసార్లు దీని ఒంటికి ఆవ నూనె, బాదం నూనె దట్టంగా పట్టించి స్నానం చేయిస్తారు. దున్నపోతుల్లోనే ఇది వెరీ వెరీ స్పెషల్‌గా నిలిచింది.