Andhrabeats

ఏపీలో ఈ 18 రోడ్లపై టోల్‌ టాక్స్‌

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల కుప్పగా మారిందని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం రోడ్లను బాగు చేసేందుకు జనాన్నే నమ్ముకుంది. వారు తిరిగే రోడ్లపై వారి నుంచే డబ్బులు వసూలు చేసి రిపేర్లు చేయించనుంది. ప్రస్తుతం జాతీయ రహదారుల తరహాలోనే రాష్ట్ర రహదారుల్ని కూడా దశల వారీగా పీపీపీ విధానంలో అభివృద్ధి చేసి వాటిపై టోల్‌ గేట్లు పెట్టేందుకు సిద్దమవుతోంది. తొలి దశలో 18, రెండో దశలో 68 రోడ్లు అభివృద్ధి చేసి టోల్‌ వసూలు చేయనున్నారు.

జాతీయ రహదారుల తరహాలోనే తొలి దశలో 18 స్టేట్‌ రోడ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించి వాటిని అభివృద్ధి చేయనుంది. ఇందుకైన ఖర్చును ప్రజల నుంచే వసూలు చేయడానికి ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఆ రోడ్లకు టోల్‌ ట్యాక్స్‌ కూడా వసూలు చేయాలని భావిస్తోంది.

ఆ 18 రోడ్లు ఇవే..

1. చిలకపాలెం–రామభద్రపురం–రాయగడ 130 కిలోమీటర్లు
2. విజయనగరం–పాలకొండ 72.55 కిలోమీటర్లు
3. కళింగపట్నం–శ్రీకాకుళం–పార్వతీపురం 113.40 కిలోమీటర్లు,
4. భీమునిపట్నం–నర్సీపట్నం 78.10 కిలోమీటర్లు
5. కాకినాడ–జొన్నాడ 48.84 కిలోమీటర్లు
6. కాకినాడ–రాజమండ్రి కెనాల్‌ 65.20 కిలోమీటర్లు
7. ఏలూరు–మేడిశెట్టివారిపాలెం 70.93 కిలోమీటర్లు
8. నరసాపురం–అశ్వారావుపేట 100 కిలోమీటర్లు
9. ఏలూరు–జంగారెడ్డిగూడెం 51.73 కిలోమీటర్లు
10. గుంటూరు–పర్చూరు 41.44 కిలోమీటర్లు
11. గుంటూరు–బాపట్ల 51.24 కిలోమీటర్లు
12. మంగళగిరి–తెనాలి–నారాకోడూరు 40 కిలోమీటర్లు
13. బేస్తవారిపేట–ఒంగోలు 113.25 కిలోమీటర్లు
14. రాజంపేట–గూడూరు 95 కిలోమీటర్లు
15. ప్యాపిలి–బనగానపల్లి మధ్య 54.44 కిలోమీటర్లు
16. దామాజీ పల్లి–నాయినపల్లి క్రాస్‌–తాడిపత్రి మధ్య 99 కిలోమీటర్లు
17. జమ్మలమడుగు–కొలిమిగుండ్ల మధ్య 43 కిలోమీటర్లు
18. సోమందేపల్లి–హిందూపురం–తూముకుంట 35.53 కిలోమీటర్లు

 

TOP STORIES