Andhrabeats

ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రారంభం కానున్న‌ అన్‌స్టాప‌బుల్ సీజన్ 4

బాలకృష్ణ హోస్ట్‌గా వ్యహరిస్తోన్న అన్‌స్టాప‌బుల్ సీజన్ 4కు అంతా సిద్ధ‌మైంది. ఈ సీజన్ మొద‌టి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రారంభం కానుంది. ఈ నెల 25న రాత్రి 8.30 గంట‌ల‌కు ఆహా ఓటీటీలో ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. గతంలో రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా చంద్రబాబుతో ప్రారంభమైన విష‌యం తెలిసిందే. 

ఈ టాక్ షోకు సంబంధించిన ఫ‌స్ట్ ఎపిసోడ్‌ షూటింగ్ ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో పూర్తి చేయ‌డం జ‌రిగింది. తాజాగా ఈ దీనికి సంబంధించిన ప్రోమోను మేక‌ర్స్‌ విడుదల చేశారు. ఇందులో చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావ‌న హైలైట్‌గా నిలిచింది.

ఇక తాజాగా విడుదలైన  ప్రోమోలో మా బావగారు.. మీ బాబు గారు.. చంద్రబాబు నాయుడు  అంటూ ఆయన్ను బాల‌య్య‌ ఆప్యాయంగా ఆహ్వానించ‌డం మ‌నం చూడొచ్చు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో కక్ష్య రాజకీయాలు మొదలయ్యాయి. తాను మాత్రం వాటికి దూరంగా ఉంటాను. కానీ తప్పు చేస్తే మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లో వ‌దిలే ప్రసక్తి లేదంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఇక బాల‌కృష్ణ‌ మాట్లాడుతూ.. ఆకాశంలో సూర్య చంద్రులు.. ఆంధ్రాలో బాబు, పవన్ బాబు అంటున్నారు అని అన్నారు. దీనికి చంద్రబాబు రిప్లై ఇస్తూ.. మీరు (బాలయ్య) ఎలాగైతే సినిమాల్లో అన్‌స్టాప‌బుల్‌గా ఉన్నారో.. రాజకీయాల్లో నేను అన్‌స్టాప‌బుల్ అంటూ చెప్పడం బాగుంది. 

మొత్తంగా మొద‌టి ఎపిసోడ్‌లో పవన్ ప్రస్తావన తీసుకొచ్చి అటు మెగాభిమానుల్లో కూడా ఈ ఎపిసోడ్‌పై ఆసక్తి రేకెత్తించారు. దాంతో ఈ ఫ‌స్ట్ ఎపిసోడ్ కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఫ్యాన్స్ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు.

TOP STORIES