వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలతో పాటు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌ఆర్‌ఐ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలకు మాత్రం అనుమతివ్వనున్నారు.