అందరూ సెల్ ఫోన్ కి బానిసలు అయిపోయారు, దాంట్లో అనుమానమే లేదు. నేటి సమాజంలో సెల్ ఫోన్ వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి, కానీ మనం సెల్ ఫోన్ చూడటం మాత్రం మానడం లేదు .చిన్నపిల్లలైతే మరీ ఎక్కువ అయిపోయారు.,అన్నం తినిపించాలంటే సెల్ ఫోన్ ఏ పనైనా చేయాలంటే సెల్ ఫోన్ అడిక్షన్ తగ్గించుకోవాలంటే మనం రోజుకి ఒక నాలుగైదు గంటలు సెల్ ఫోన్ చూస్తుంటే రెండు గంటలకు తగ్గించుకోవాలి అంటే రోజురోజుకి కొద్దిగా తగ్గిస్తూ వస్తే సరిపోతుంది చీటికిమాటికి సెల్ ఫోన్ తీసుకోకుండా కొంత సమయం పిల్లలతో గడపడం మనకు ఇష్టమైన పనులు చేయడం ఇటువంటి వాటి వల్ల కొద్దిగా సెల్ ఫోన్ అడిక్షన్ తగ్గించుకోవచ్చు. మన మనసును మనం కంట్రోల్ చేసుకోవాలి కదా అప్పుడు అది సాధ్యమవుతుంది.
స్క్రీన్‌ల నుండి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ విడుదలను ఆలస్యం చేసి నిద్రను దూరం చేస్తూ ఉంది
పడుకునే ముందు ఫోన్‌లను ఉపయోగించడం వల్ల మానసిక ప్రేరణకు గురయి మెదడు నిద్రకు సిద్ధంగా ఉండదు.
ఫోన్‌లలో సమాచారం, మెసేజస్, నోటిఫికేషన్స్ ను చూడడం, సమాధానాలు ఇవ్వడం వలన మానసిక ఉద్రేకం, ఒత్తిడి ఏర్పడి విశ్రాంతి తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బ తింటూ ఉంది.
మొబైల్ గేమ్‌లు, సోషల్ మీడియా ఇంటర్నెట్ బ్రౌజింగ్ నిద్ర సమయాన్ని తగ్గిస్తూ ఉంది.
బెడ్‌లో ఫోన్‌లను ఉపయోగించడం వల్ల మెదడు నిద్ర పోవడం కంటే ఎక్కువగా మెలుకవతో ఉండడానికి అలవాటు పడి నిద్రకు దూరం…
వార్నింగ్…. మొబైల్ వాడకం ఒక్క నిద్రనే కాకుండా, శారీరకంగా, మానసికంగా, భావోద్రేకపరంగానూ మనిషిని నిర్వీర్యం చేస్తున్నాయి.
సూచనలు
బాధ్యతాయుతంగా ఉపయోగించండి
ఆరోగ్యకరమైన సరిహద్దులను ఏర్పరచుకొండి
స్క్రీన్ సమయాన్ని పరిమితులను సెట్ చేసుకొండి
సామాజిక కుటుంబ సంభందాలను బలపరచుకొండి
సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల కంటి చూపు ఏం విధంగా ప్రభావితం కావచ్చు?
సెల్ఫోన్ రాత్రి పూట లైట్స్ లేకుండా కానీ డిమ్ లైట్ లో కానీ చూడటం వల్ల కంటిచూపు బాగా దెబ్బతింటుంది.ఫోన్ సెట్టింగ్స్ లో లైట్ మధ్యస్థంగా వుండటం మంచిది.ఆ బ్లూ రేస్ వల్ల చూపు మాత్రమే కాదు నిద్ర కూడా పాడవుతుంది.ఆ అలవాటు వల్ల స్లీప్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది.సరైన భంగిమ లో కూర్చొని చూడకపోతే మెడ నొప్పులు,నడుము నొప్పులు వగైరా వస్తాయి.తులసి ఆకులు ఫోన్ వెనుక భాగం లో పెటుకుంటే రేడియేషన్ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది.ఇది రాందేవ్ బాబా గారు ప్రత్యక్షం గా కూడా నిరూపించారు.*#07# డయల్ చేస్తే ఫోన్ లో రేడియేషన్ ప్రభావం ఎంతో తెలుస్తుంది.
సెల్ ఫోన్ వాడకం వలన లాభాలు ఉన్నాయి అన్నది వాదన లేని విషయం. అయితే సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన శారీరక , మానసిక సమస్యలు రెండూ వస్తాయి. శారీరకంగా మెడ నొప్పి, తలనొప్పి, ఊబకాయం, వినికిడి లోపం మొదలైనవి వస్తాయి. మానసికంగా నిద్ర లేమి, అంతర్జాల వ్యసనం, ఆందోళన, దిగులు, పిల్లల్లో మాట/భాష లోపాలు, ఏకాగ్రత కుదరకపోవడం, పని వాయిదా, అలసట ఇంకా చాలా దుష్ఫలితాలు ఉన్నాయి. సెల్ ఫోన్ వాడకం సెల్ ఫోన్ లో డిజిటల్ వెల్ బీయింగ్ ద్వారా మనం ఎంత సేపు వాడుతున్నాం అన్నది చూసుకుని సెల్ ఫోన్ మొత్తం వాడకం రోజుకి ఒకటి రెండు గంటలు మించకుండా చూసుకోవాలి