Andhrabeats

డిప్యూటీ సీఎంగా ఉన్నా అధికారులు సహకరించడం లేదు – పవన్ కళ్యాణ్

రేషన్ బియ్యం అక్రమ రవాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు హబ్ గా మార్చారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కాకినాడ పోర్టులో శుక్రవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాకినాడ పోర్టుకు వస్తానంటే కొందరు నన్ను రావద్దన్నారు అని పవన్ తెలిపారు. డిప్యూటీ సీఎంగా ఉన్న నాకే పోర్టు అధికారులు సహకరించలేదని వాపోయారు. కాకినాడ పోర్టు దగ్గర సరైన సెక్యూరిటీ లేదన్నారు. ఉగ్రవాదులు వచ్చి కాల్చేస్తే ఇక్కడ దిక్కు లేదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లెటర్ రాస్తున్నట్లు పవన్ తెలిపారు.

రేషన్ బియ్యం అక్రమ ఎగుమతి వెనుక పెద్దవాళ్లు ఉన్నారు. కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లో కిలో రేషన్ బియ్యాన్ని 73 రూపాయలకు అమ్ముకుంటున్నారు. రేషన్ బియ్యం అమ్ముకుంటూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. ఎవరైనా అవకతవకలు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయాలి. రేషన్ బియ్యం అక్రమ రవాణపై సీఎం దృష్టికి తీసుకెళ్తా. రేషన్ బియ్యం అక్రమ ఎగుమతి వెనుక పెద్ద వాళ్లు ఉన్నారు. సీఐడీ, సీబీఐ.. ఎవరితో విచారణ చేయించాలో త్వరలో నిర్ణయం తీసుకుంటాం” అని పవన్ కల్యాణ్ తెలిపారు.

కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణపై సీరియస్ అయ్యారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పోర్టు అధికారులపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. పోర్టులోకి రేషన్ రైస్ ఎలా వస్తోందని ఆయన ప్రశ్నించారు. పోర్టులోకి అక్రమంగా రేషన్ బియ్యం రవాణ చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

TOP STORIES