డాక్టరేట్ రేట్ ఎంత గొప్పవాడైనా ఎగిరి గంతేసి స్వీకరిస్తారు. ప్రముఖ వెటరన్ క్రికెటర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం ఇస్తానంటే తీసుకోనని సున్నితంగా తిరస్కరించి తాను స్పెషల్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
రాహుల్ ద్రావిడ్‌ని బెంగుళూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టాతో సన్మానించాలనుకుంది. కానీ దానిని అతడు గౌరవంగా నిరాకరించాడు. తాను ఆటల మీద భవిష్యత్తుల్లో ఏదో ఒక రోజు పరిశోధనా వ్యాసాలు రాసి పట్టా తీసుకుంటానని చెప్పాడు
తన భార్య డాక్టర్ అని ఆమె నిద్రాహారాలు లెక్కచేయక అహర్నిశలు శ్రమించి ఆ డిగ్రీ సంపాదించుకుందని చెప్పాడు.
తన తల్లి ఆర్ట్స్ ప్రొఫెసర్, దాదాపు 50 సంవత్సరాల వయసులో దానికోసం శ్రమించిందని తెలిపాడు .
తాను క్రికెట్‌లో కష్టపడ్డానని కానీ వారిలా చదువులో శ్రమించలేదని చెప్పాడు. తాను కూడా వారిలా డాక్టర్ పట్టా కోసం శ్రమిస్తానని, క్రీడలపై అకాడమిక్ రీసెర్చ్ వ్యాసాలు రాసి డాక్టరేట్ సాధించుకుంటానని తెలిపాడు. గౌరవ పట్టా వద్దని వారికి కృతజ్ఞలతో విన్నవించుకున్నాడు.