పథకాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
వచ్చే విద్యా సంవత్సరంలోపు తల్లికి వందనం అమలు చేయాలని ఆర్థిక శాఖకు ఏపీ కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. పీఎం కిసాన్‌కు కేంద్రం డబ్బులు విడుదల చేసినప్పుడు రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాలపై చర్చ జరిగింది. […]
నాకు ప్రజలే హైకమాండ్ : చంద్రబాబు
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని, పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే చెట్లు కొట్టేసి, పరదాలు కట్టి, జనాన్ని బలవంతంగా తరలించేవారని, తాను అలాంటి సీఎం కాదని, సాదాసీదాగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులు చూసుకోవడమే తన బాధ్యత అని అన్నారు. తనకు హైకమాండ్ అంటూ ఏం లేదని, 5 కోట్ల ప్రజలే తనకు హైకమాండ్ అని […]
ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు
ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పెట్టుబడి తగ్గించి రైతులను ఆప్పుల ఊబి నుండి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే తమ సంకల్పమన్నారు. […]
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు
బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. క్లాస్ రూమ్‌లకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కష్టపడి చదువుకోవాలని, చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ కూడా ఉన్నారు. బాపట్ల మున్సిపల్ స్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నిరంతరం నేర్చుకోవడం […]
నా పాలన ఎలా ఉందో చెప్పండి : చంద్రబాబు
తన పాలన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎపీ సీఎం చంద్రబాబు ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై IVRS (Interactive Voice Response System) ఫోన్లు చేసి అమలు తీరును తెలుసుకుంటామని ప్రకటించారు. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. ఈ క్రమంలో లబ్ధిదారుల నుంచి ఆయా పథకాల […]